ఒక నాయకుడు అంటే తన చుట్టూ ఉన్నవారికి భరోసా ఇచ్చేవాడై ఉండాలి..అప్పుడే ఆ నాయకుడిపై నమ్మకం ఉంటుంది. ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణానికి నడుంబిగించారు.  అదే సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు.  అయితే మొదటి నుంచి పోలవరం పై ఎన్నో సమస్యలు వస్తున్నా..ఏక్కడా వెనక్కి తగ్గకుండా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. 
Image result for polavaram project chandrababu naidu
సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపి ముఖ్యమంత్రి సాహసోపేతమైన పని చేశారు.  పోలీసులు వద్దని వారిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. నిచ్చెన మెట్లపై 25 మీటర్లు ఎక్కి పూజలు చేశారు. స్పిల్ వే‌పై 25 మీటర్ల ఎత్తున క్రస్ట్ లెవల్‌లో తొలి రేడియల్ గేటును బిగించాల్సి ఉంది. ఇందుకోసం అక్కడ తొలుత పూజలు చేయాల్సి ఉండడంతో చంద్రబాబు పైకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు.  కానీ భద్రత దృష్ట్యా అంత పైకి ఎక్కడం మంచిది కాదని పోలీసులు అభ్యంతరం చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..ఈ పని నేనే చేయకపోతే..తర్వాత పనులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే భయపడితే..ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందికి భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అనంతరం నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి పూజలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: