కొత్త సంవత్సరం అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ కొత్త ఊహలు చిగురిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి సమయమే ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు కొత్త సంవత్సర వేడుకలు ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతాయి.. ఎక్కడ ముగుస్తాయి.. అనే విషయాలను తెలుసుకుందాం..

Image result for new year 2019

ఏవో కొత్త ఊసులు, ఆశలు, సంబరాలు, వేడుకలు.. ఇదే న్యూ ఇయర్ స్పెషాలిటీ.! కొత్త ధైర్యాన్ని, స్పూర్తిని నమ్మకాన్ని కలిగించే ఆ మధురక్షణాల కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఆ విలువైన క్షణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అసలు ఈ కొత్త సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా? క్రీస్తు పూర్వం 2000 నుంచే దీనికో కథ ఉంది. గ్రిగోరియన్ క్యాలెండర్ లేదా జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తేదీని ప్రపంచవ్యాప్తంగా నూతర సంవత్సర వేడుకగా తీర్మానించారు.

Image result for new year in new zealand

ప్రాంతాలు, సాంస్కృతిక తేడాలను బట్టి కొన్నిదేశాలు ఇతర తేదీలను కూడా కొత్త సంవత్సరంగా జరుపుకొంటున్నాయి. తొలిసారిగా ప్రపంచంలో ఎక్కడ తొలి సంవత్సరం సంబరాలు ప్రారంభమవుతాయో తెలుసా? న్యూజిలాండ్ లోని అత్యంత చిన్నదైన ఛాథమ్ దీవుల్లో మొదటి సారిగా న్యూ ఇయర్ అడుగుపెడుతుంది. ఇక చివరి సంబరాలు అమెరికాలోని సమోవా దీవుల్లో జరుపుకొంటారు. అంటే న్యూజిలాండ్ లో ఛాథమ్ దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు ఆరంభమైన 24గంటల తర్వాత అమెరికాలోని సమోవా ప్రజలు ఈ వేడుకలు జరుపుకొంటారు.

Image result for new year in america

ఆశ్చర్యం ఏంటంటే సమోవా, ఛాథమ్ దీవుల మధ్య దూరం కేవలం 554 మైళ్ళు . అంటే ఒకరు విమానంలో ఛాథమ్ నుంచి సమోవాకు ఒక గంటలో ప్రయాణించి ఒకేరోజు రెండుసార్లు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. కాని భూమి గుండ్రంగా ఉండి కుడివైపు నుంచి ఎడమ వైపునకు తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి సూర్యుడికి ఆసౌకర్యం లేదు. ఇదండీ... న్యూయర్ ఫస్ట్ అండ్ లాస్ట్ సెలబ్రేషన్స్ సంగతి!


మరింత సమాచారం తెలుసుకోండి: