వైసీపీ అధినేత జగన్ ఇపుడు టీడీపీకి గట్టి ప్రత్యర్ధి. ఏ సర్వే చూసినా అయన పార్టీదే పై చేయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఓ వైపు జగన్ చేస్తున్న పాదయాత్ర హోరెత్తిస్తూండగా మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక పవనాలను బాగానే పెంచుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. మరి ఇదే జోరు జగన్ కొనసాగించకుండా కట్టడి వేసేందుకు టీడీపీ అనేక ఆయుధాలను బయటకు తీస్తోంది.


అనుభవం లేదట :


జగన్ కి పాలనాపరంగా ఏ మాత్రం అనుభవం లేదని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఆయనకు పంచాయతీ వార్డు మెంబర్ గా చేసిన అనుభవం కూదా లేదని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కి అసలు ఏమి తెలుసని అన్నీ చేసేస్తానని అంటున్నారని చంద్రబాబు నిలదీస్తున్నారు. సంపద, స్రుష్టి, ఆర్ధీకాభివ్రుధ్ధి, సుపరిపాలన, ఎకానమీ వీటిని గురించి జగన్ కు తెలుసా అని పెద్ద పరీక్షనే బాబు పెట్టారు. విశ్వస‌నీయత లేని వారి మాటలు జనం కూడా నమ్మరని బాబు అన్నారు. నిజానికి గత ఎన్నికల‌ సమయంలో  కూడా టీడీపీ నేతలు జగన్ కి ఏమీ అనుభవం లేదని చెప్పి గెలిచారు. ఇపుడు సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా ఆ బ్రహ్మాస్త్రమే బయటకు తీసారు. మరి వర్కౌట్ అవుతుందా..


సెటైర్లు స్టార్ట్ :


బాబు ఇలా అన్నారో లేదో సొషల్ మీడియా వేదికగా సెటైర్లు పడిపోతున్నాయి. అనుభవం గురించి చెబుతున్న చంద్రబాబు తన కొడుక్కి ఏమి అనుభవం ఉందని కీలక మంత్రిత్ర శాఖలను కట్టబెట్టారని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెండు సార్లు ఎంపీ, ఇపుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పదేళ్ళ పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయనకు అనుభవం లేదనడం అక్కసుతో చేసే విమర్శలేనని అంటున్నారు. ఏం అనుభవం ఉందని ఒడిషాకు నవీన్ పట్నాయ‌క్ ని మొదటిసారి జనం ఎన్నుకున్నారని, అలాగే డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా డైరెక్ట్ గానే సీఎం అయ్యారని గుర్తు చేస్తున్నారు.

 జగన్ మీద అనవసరంగా బురద జల్లి జనంలో మళ్ళీ దెబ్బ తీయాలనుకుంటే ఈ మారు కుదరదరి వైసీపీ సోషల్ మీడియా వర్కర్స్ అంటున్నారు . మరి బాబు తీసిన ఈ అస్త్రం ఆషా మాషీగా కాదు, ఏపీ సమస్యలు ఏకరువు పెట్టి తాను కాకుంటే జగన్ వాటిని తీర్చగలరా అంటూ జనంలోకి రెండవమారు అధికారం కోసం అడిగేందుకు చేసుకున్న వ్యూహంగా కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: