తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు పోటీ పడుతున్నారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు చంద్రుల మధ్య ఏర్పడిన అనవసరమైన పోటీ ఒకరకంగా తెలుగు రాష్ట్రాల పరువు తీస్తోందనే చెప్పాలి. పోటా పోటీగా ఇద్దరూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతల దగ్గరకు వెళ్ళి మద్దతు కోసం పాకులాడుతుండటం విచిత్రంగా ఉంది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్, ఏపి సిఎం చంద్రబాబునాయుడులు వ్యక్తిగత అజెండాలను సాధించుకోవటమే లక్ష్యంతో పోటీ పడుతున్నారు. దాంతో జాతీయస్ధాయిలో ఇద్దరూ పలుచనవుతున్నారు.

 Image result for kcr and naveen patnaik

ప్రతీ ఎన్నికకూ ఒకరితో పొత్తు పెట్టుకునే చంద్రబాబు తాజాగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్రమోడిపై ఉన్న వ్యక్తిగత కక్షతో కాంగ్రెస్ కు చేరువై మోడి వ్యతిరేక ఫ్రంట్ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. ఇప్పటి వరకూ సిఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామితో పాటు తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్, మహారాష్ట్రలో శరద్ పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మాయావతి లాంటి వాళ్ళను కలిసి మద్దతు కోరుతున్నారు.

 Image result for kcr and mamata benarji

అదే సమయంలో బిజెపియేతర, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంతో తెలంగాణా సిఎం కెసియార్ కూడా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ఇఫ్పటి వరకూ మమతా బెనర్జీ, ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్, మాయావతి లాంటి వాళ్ళను కలిశారు. విచిత్రమేమిటంటే ఇద్దరు చంద్రులు పోటీ పడి జాతీయస్ధాయి నేతలను కలుస్తున్నా వారి నుండి స్పష్టమైన హామీలు వచ్చినట్లు కనబడటం లేదు. మద్దతు విషయంలో ఇద్దరికీ ఎవరూ హామీలు ఇవ్వకపోవటంలో ఎవరి వ్యక్తిగత అజెండాలు వారికున్నాయి.  

 Image result for chandrababu and mamata benarji

 ముందుగా తెలంగాణా సిఎం విషయం తీసుకుంటే కెసియార్ పై ఎవరికీ నమ్మకం ఉన్నట్లు కనబడటం లేదు. ఎందుకంటే, జాతీయ స్ధాయిలో ప్రస్తుతానికి కాంగ్రెస్, బిజెపిలు రెండే జాతీయ పార్టీలన్న విషయం తెలిసిందే. రెండింటిలో ఏదో ఒక జాతీయ పార్టీ మద్దుతు లేకుండా ఏ ఫ్రంటు కూడా ముందుకుసాగే అవకాశం లేదు. కెసియార్ అజెండా ఏమో కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్. అందుకే మద్దతు ఇవ్వటానికి జాతయ పార్టీల నేతలు సంసయిస్తున్నారు. ఇక చంద్రబాబు పరిస్దితేమో ఎప్పటికప్పుడు పొత్తులను మార్చే అలవాటున్న కారణంగా రేపటి రోజున మళ్ళీ నరేంద్రమోడి పంచన చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

 Related image

రేపటి ఎన్నికల్లో మోడి లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సొస్తే చంద్రబాబు వెంటనే ఎన్డీఏకి మద్దతిచ్చినా ఆశ్చర్యంలేదు. అదే సమయంలో రేపటి ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబును కూడా జాతీయనేతలు తేలిగ్గానే తీసుకుంటున్నారు. పైగా బిజెపియేతర పార్టీలు ఇపుడే తన వల్లే ఏకతాటిపైకి వస్తున్నాయన్న కలరింగ్ ను చంద్రబాబు ఇచ్చుకోవటం కూడా చాలా పార్టీల నేతల ఇష్టపడటం లేదు. ఎందుకంటే అవన్నీ చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరేనాటికే కాంగ్రెస్ తో నడుస్తున్నాయి. అంటే వ్యక్తిగత ప్రచారానికే చంద్రబాబు ఎక్కువ పాకులాడుతున్న విషయం వారికి అర్ధమవుతోంది. మొత్తానికి ఇద్దరు చంద్రులు బొంగరంలాగ అందరి మద్దతు కోసం పాకులాడటమే కానీ ఎవ్వరూ స్పష్టమైన హామీ ఇవ్వటం లేదట. చూద్దాం రేపటి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏమవుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: