ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల రోజుకో శ్వేత పత్రం విడుదల చేస్తున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు. పనిలో పనిగా విపక్షనేత జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ విమర్శల్లో చంద్రబాబు మిస్సవుతున్న లాజిక్ ఆయన కుమారుడు లోకేశ్‌ ను ఇబ్బంది పెట్టేలా ఉంది.



జగన్‌ కు ఏం అనుభవం ఉందని ఆయన ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు.. ఆయనకు అర్థ శాస్త్రంపై కనీస అవగాహన ఉందా.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే లాజిక్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారుజగన్ ఇప్పటికే రెండు సార్లు పార్లమెంట్‌ కు ఎంపికయ్యారు.. 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి లోకేశ్‌కు ఏం అర్హత ఉందని వారు ప్రశ్నిస్తున్నారు.

Image result for LOKESH JAGAN

కనీసం పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలవని లోకేశ్‌ను ఏకంగా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కు అనుభవం లేకపోవడాన్ని ఎలా తప్పుబడతారని నిలదీస్తున్నారుచంద్రబాబుకు ఓటమి భయం పట్టుకోవడం వల్లనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారుప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు శ్వేతపత్రాల డ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి పార్దసారధి కామెంట్ చేశారు.

Related image

ప్రతిపక్ష నేతను విమర్శించడం.. లేదంటే ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనే ఆలోచన తప్ప చంద్రబాబు చేస్తుందేమీ లేదని విమర్శిస్తున్నారుఅందుకే విమర్శలు గుప్పించే ముందు.. ఒక్కసారి తమవైపు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కౌంటర్లు పడకుండా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. మరి ఇకనైనా సీఎం చంద్రబాబు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తపడతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: