ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో రాష్ట్రంలో అనేక ప్రముఖ మీడియా సంస్థలు జాతీయ మీడియా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం వరకు వైసిపి పార్టీ వైపు ఎక్కువ విజయ అవకాశాలు ఉండగా తాజాగా ఇటీవల ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో వైసిపి మరియు టిడిపి పార్టీల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది అని సర్వేలో ఫలితం రావడంతో తెలుగుదేశం పార్టీలో కొంత ఉత్సాహం నెలకొంది.

Image result for ap politics

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జాతీయ‌మీడియా స‌ర్వే రిజ‌ల్ట్స్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఆగ‌స్ట్ నుండి ఏపీలో స‌ర్వే మొద‌లు పెట్టిన రిప‌బ్లిక్ టీవీ.. తాజాగా ఆ స‌ర్వే ఫ‌లితాల‌ను వెళ్ళ‌డించింది.

Image result for ap politics

ఆ స‌ర్వే రిపోర్ట్స్ ఒకసారి చూస్తే.. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి 8 లోక్‌స‌భ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, వైసీపీకి 14 లోక్‌స‌భ స్థానాలు, కాంగ్రెస్‌కు 3 లోక్‌స‌భ స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చేసింది.

Image result for ap politics

ఇక మొత్తం ఓట్ల శాతం ఎలా ఉందంటే.. టీడీపీ-కాంగ్రెస్ కూట‌మికి(ఏపీలో కూడా క‌లిస్తే) 38.2 శాతం, వైసీపీకి 41.6 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే తెలిపింది. ఇక బీజేపీకి 11 శాతం, ఇత‌రుల‌కు 9.3 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే తేల్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: