ఎన్నికలు ముంచుకొస్తున్న కొలది ఏపీ సీఎం చంద్రబాబు టిడిపి పార్టీ అధ్యక్షులతో మరియు నాయకులతో ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ సమావేశాలలో మునిగిపోతున్నారు. ఈసారి రాబోతున్న ఎన్నికలలో టెక్నాలజీని బాబు గారు బాగా వాడుతున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో త్వరలో రాబోతున్న మోడీ పర్యటన గురించి తాజాగా టిడిపి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చర్చించారు.

Related image

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..తన ముందు ప్రధానంగా మూడు బాధ్యతలు ఉన్నాయని...ప్రజలు, ప్రభుత్వం, పార్టీ బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. శ్వేతపత్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించామని, కేంద్రం తోడ్పాటు లేదనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు.

Related image

విభజన కష్టాలు వెంటాడుతున్నా పట్టుదలతో ముందుకెళ్తున్నామని బాబు చెప్పుకొచ్చారు. నాలుగున్నరేళ్లలో చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజల్లో భరోసా పెంచాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

Related image

మొత్తం మీద ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు వస్తేనే మళ్లీ అభివృద్ధి జరుగుతుందని అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థమవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: