రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ప్రాంతంగా రాజ‌ధాని ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య‌వాడపై రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రి దృష్టీ ఉంటుంది. ఇక్క‌డ ఏం జ‌రిగినా.. ఓ సంచ‌ల‌నంగా మారుతుంది కూడా! ఇక‌, బెజ‌వాడ రాజ‌కీయాల గురిం చి ప్ర‌త్యేకంగా చెప్పుకొనేది ఏముంటుంది? ఇక్క‌డ రాజ‌కీయాల్లో త‌లపండిన మేధావులు ఉన్నారు. ఎక్క‌డిక‌క్కడ రాజ‌కీ యాల‌కు పెట్టింది పేరుగా బెజ‌వాడ గుర్తింపు సైతం పొందింది. అలాంటి విజ‌య‌వాడ‌లో ఒక‌ప్పుడు కాంగ్రెస్ బ‌లం భారీ ఎత్తున  ఉండేది. రాను రాను ఇక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భావం దిగ‌జారింది. ఇక‌, ఇప్పుడు మాత్రం టీడీపీ జోరు కొన‌సాగుతోంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించాల‌ని చూస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇక్క‌డ కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

Image result for vangaveeti radha krishna

పైకి మాత్రం అస్స‌లు విజ‌య‌వాడ‌ను టార్గెట్ చేసిన‌ట్టు ఎక్క‌డా ఆయ‌న క‌నిపించడం లేదు. కానీ.. చాప‌కింద నీరులాగా ఆయ‌న వ్యూహాలు సిద్ధం చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక్క‌డ వైసీపీలో టికెట్ ఆశించి భంగ ప‌డిన బ‌ల‌మైన నాయ‌కుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌ను పార్టీలో చేర్చుకునే విష‌యంపై ఇప్ప‌టికే జ‌న‌సేనాని అన్నీ సిద్ధం చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. వైసీపీలో త‌న‌కు తీర‌ని ప‌రాభ‌వం క‌ల‌గ‌డంతో రాధా పార్టీ మారాల‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని తాజాగా స‌మాచారం. ఈక్ర‌మంలో రాధాను పార్టీలోకి తీసుకుని ఆయ‌న కోరుకుంటున్న సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించే దిశ‌గా కూడా ప‌వ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఫ‌లితంగా ఇక్క‌డ పాగా వేయ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు., కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన రాధాకు అవ‌కాశం ఇవ్వ‌డం కూడా వ్యూహంలో భాగ‌మేన‌ని తెలుస్తోంది. 

Image result for గ‌ద్దె రామ్మోహ‌న్‌

ఇక‌, విజ‌య‌వాడ తీర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి .. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కోగంటి స‌త్యానికి ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోం ది. అత్యంత కీల‌క‌మైన‌ సామాజిక వ‌ర్గానికి చెందిన స‌త్యం.. తూర్పు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నే న‌మ్మ‌కంతోనే ప‌వ‌న్ ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, ఇక్క‌డ బ‌లంగా ఉన్న టీడీపీ నేత గ‌ద్దె రామ్మోహ‌న్‌కు చెక్ పెట్టేందుకు కూడా కోగంటి బాగానే ప‌నిచేస్తాడ‌ని అంటున్నారు. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం.. ప‌శ్చిమంలో ఎవ‌రికి టికెట్ ల‌భిస్తుందో చూడాలి. ఏదేమైనా విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన క‌దుపుతున్న పావులు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: