విశాఖ అంటే ప్రశాంతనగరం. ఇక్కడ ప్రజలు కూడా శాంత  స్వభావులు. అంతేనా ప్రక్రుతి కూడా చాలా ప్రశాంతం. అందువల్లనే విశాఖ అంటే అంతా ఇష్టపడతారు. ఇక్కడ సాగరాన్ని, పచ్చని కొండలను చూసేందుకు ఇష్టపడతారు. మరి అటువంటి విశాఖ కూడా ఓ సందర్భంలో భయపడిపోయింది. ఆనాటి చేదు అనుభవాలు తలచుకుంటే ఇప్పటికీ షాకే మరి.


సునామీ భయం :


విశాఖ బీచ్ ఎపుడూ లాగానే ఆ రోజు మామూలుగానే ఉందనుకున్నారు. కానీ అలా అలా దూసుకుని  అలలతో సహా చాలా ముందుకు వచ్చేసింది. ఒడ్డున ఉన్న పడవలను సైతం తనలోపలికి లాక్కుపోయింది. రక్షణ గోడలను ఢీ కొట్టి విద్వంసం చేసింది. రాక్షస అలలతో పెను  భీభత్సం స్రుష్టించింది. ఆ రోజును విశాఖ వాసులు ఎప్పటికీ మరచిపోరు. కడలినే నమ్ముకున్న మత్స్య‌కారులు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు 2004 డిసంబర్ 26. ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు గడచినా భయం అలా వెంటాడుతూనే ఉంది. సునామీ ఒళ్ళు గగ్గుర్పొడిచేలా  చేసిందని జనం అంటారు.


ప్రతీ ఏటా పూజలు :


ఇక సునామి వచ్చిన ఈ తేదీని గుర్తుపెట్టుకుని ప్రతీ  ఏటా ఇదే రోజున గంగమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తారు. మత్స్య‌కార మహిళలు పెద్ద సంఖ్యలో సాగర తీరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అ గంగమ్మ పూజలు నిర్వహిస్తారు. ఎటువంటి ఆపదలు లేకుండా కాపాడాలని, శాంతంగానే ఉండాలని, తమకు జీవనోపాధిని ఎపుడూ చూడాలని వేడుకుంటారు. ఈ రోజు పెదజాలారిపేటలో మత్స్య‌కార మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ పూజలు సునామి నాటి రోజుని మరో మారు నగర వాసులకు గుర్తుకుతెచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: