ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ప్రత్యేక హోదా ప్రధానాంశం కాబోతోంది. టీడీపీ, వైసీపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా జపం చేస్తున్నాయి. కానీ ఒకదాంతో మరొకటి కలవవు.. ఎవరి దారి వారిదే..! అందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ పార్టీల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం ఇదే నినాదంతో ముందుకెళ్లాలని డిసైడైంది. అంతేకాక.. పార్టీ శ్రేణులను అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు.

Image result for tdp leaders

జనవరి నుంచే పూర్తి స్థాయి ఎన్నికల మోడ్ లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకు తగ్గట్లే పార్టీ శ్రేణులను కూడా సన్నాహపరిచేందుకు సంకేతాలిస్తున్నారు. జనవరిలోనే పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పేశారు. దీంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. తమకు సీట్లు వస్తాయో.. రావోననే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Image result for tdp leaders

తెలుగుదేశం పార్టీలో ఈసారి టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. అయితే 175 మందికి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వారందరికీ టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సేఫ్ జోన్ చూసుకునే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. నియోజకవర్గంలో పరిస్థితులను అంచనా వేస్తూ.. తమకు టికెట్ వచ్చే పరిస్థితి ఉంటే కొనసాగడం.. లేకుంటే వేరే పార్టీలో అవకాశం ఉందేమో అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది బయటకు వెళ్తారు.. ఎంతమంది ఇలాంటి ఆలోచనల్లో పడ్డారు అనే విషయం ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు.

Image result for tdp leaders

ఈసారి యువతకు పెద్ద పీట వేస్తామని చంద్రబాబు ప్రకటించడం కూడా సీనియర్లకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం. ఇదే అంశం ఇప్పుడు సీనియర్లను ఎక్కువ ఇబ్బంది పెడుతున్న అంశం. ఇంటర్నల్ సమావేశాల్లో కూడా చాలా మంది సీనియర్లకు పరోక్షంగా చంద్రబాబు సంకేతాలిస్తున్నారు. దీంతో చాలా మంది నేతలు డైలమాలో పడిపోతున్నారు. సిట్టింగులుగా ఉన్న వాళ్లకు టికెట్ రాకపోతే ఎలా అనే ఆవేదన చాలా మందిలో మొదలైంది.

Image result for tdp leaders

ఒకవేళ టికెట్ రాకపోతే ఇతర పార్టీల్లో ఏమైనా ఛాన్స్ ఉందేమోననే అంచనాలు కూడా సీనియర్లు వేసుకుంటున్నారు. అయితే.. టికెట్ రాలేదు కాబట్టి బయటికొచ్చి వేరే పార్టీలో చేరారనే పేరు రాకుండా.. ముందే మర్యాదపూర్వకంగా తప్పుకుంటే బాగుంటుందనే ఆలోచనలో చాలా మంది నేతలు ఉన్నట్టు సమాచారం. అంతేకాక.. చివరి క్షణాల్లో వెళ్తే.. పక్క పార్టీలో అయినా సీటు దొరుకుతుందో లేదో గ్యారంటీ ఉండదు. అందుకే సేఫ్ జోన్ చూసుకుంటున్నారు టీడీపీ సీనియర్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: