మరో నాలుగైదు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. పాత ఏడాదిలో జరిగిన శుభ, అశుభాలను నెమరువేసుకుని.. ఉత్సాహంగా.. కొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని అంతా ఆశిస్తారు. కొత్త ఏడాదిలో అంతా సంతోషంగా గడచిపోవాలని కోరుకుంటారు.

The mesmerising fireworks behind Harbor Bridge in Sydney

అందుకే 2019 కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ గ్రాండ్ గా పార్టీలు చేసుకుంటారు. మరి న్యూ ఇయర్ పార్టీకి ప్రపంచంలోనే అత్యుత్తమ వేదికలేవో తెలుసుకుందామా.. ఈ న్యూఇయర్ పార్టీ డెస్టినేషన్లలో ముందుండేది.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ. ఇక్కడి సిడ్నీ హార్బర్, హార్బర్ బ్రిడ్జ్, ఒపేరా హౌస్‌, బోండి బీచ్‌ మొదలైన చోట్ల జరిగే న్యూ ఇయర్ పార్టీ సందడికి అంతే ఉండదుప్రత్యేకించి ఇక్కడి మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, బాణా సంచా పేలుళ్లు స్పెషల్ ఎట్రాక్షన్.

The fireworks during Hogmanay Celebrations in Edinburgh

ఇక సెకండ్‌ ప్లేస్.. స్కాట్లాండ్‌లోని ఈడెన్‌బర్గ్ కు దక్కుకుంది. ఇక్కడి ప్రిన్సెస్‌ స్ట్రీట్ గార్డెన్‌లో వీధులన్నీ కోలాహలంతో నిండిపోతాయి. కళ్లు చెదిరే పైర్‌ వర్క్స్ ఆశ్చర్యపరుస్తాయి. సంగీత కార్యక్రమాలతో ఈ ప్రాంగణం హోరెత్తుతుంది. ఇక్కడ కుక్కలు లాగే బండ్ల లాగుడు పోటీలు స్పెషల్ ఎట్రాక్షన్.

Confetti at Times Square soaks in the revellers during New Year Celebrations in New York

మూడో స్థానం న్యూయార్క్‌ లోని టైమ్స్ స్క్వేర్ కు దక్కుతుంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో బెర్లిన్‌ లోని అలెగ్జాండ్రాప్లాజ్ నిలుస్తుంది. ఇక టాప్ ఫైవ్‌ ప్లేస్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్‌ నిలుస్తుంది. ఇక్కడి సంగీత ప్రదర్శనలు, మేజికల్ ఫైర్‌వర్క్స్ కట్టిపడేస్తాయి.

An illuminated Eiffel Tower during New Year celebrations

మరింత సమాచారం తెలుసుకోండి: