ఈ మద్య తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతభ్యాసం చేసి మంచి పొజీషన్లో ఉండాలని..సమాజంలో గర్వించే విధంగా ఎదగాలని అనుకుంటున్నారు.  అందుకోసం విదేశాలకు పంపించి ఉన్నత విద్య అభ్యసించేందుకు కృషి చేస్తున్నారు.  విద్యార్థులు సైతం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు మక్కువ చూపిస్తున్నారు.  అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు అనుకోని ప్రమాదాలకు గురి కావడం..చనిపోవడం జరుగుతుంది. 

అప్పుడు ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. తాజాగా అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. కొలిర్ విలిలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు.  క్రిస్మస్ వేడుకల సందర్భంగా తమ ఇంటిని దీపాలతో అలంకరించే పనిలో ఉండగా అకస్మాత్తుగా నిలప్పంటుకొని ఇల్లు మొత్తం కాలిపోవడంతో మంటల్లో చిక్కుకున్న ఈ ముగ్గురు విద్యార్థులు సజీవ దహనం అయినట్లు పోలీసులు తెలుపుతున్నారు. 
Image result for అమెరికాలో తెలంగాణ విద్యార్థులు
మృతులను నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు.. సాత్విక నాయక్, జయ సుచిత, సుహాన్ నాయక్. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ  ముగ్గురు కూడా ఉన్నత విద్య అభ్యసించేందుకు వీరు అమెరికా వెళ్లినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: