న్యూఇయర్.. కులం, మతం , ప్రాంతాలకు అతీతంగా ప్రపంచమంతా జరుపుకునే అతి కొద్ది పండుగల్లో ఒకటి. అందరికీ మంచి జరగాలనే పాజిటివ్ థింకింగ్‌ వ్యాపింపజేసే నిత్యనూతన వేడుక. మరి ఈ వేడుకకు ఎక్కడ జరుపుకుంటే బావుంటుంది. ఇండియాలో న్యూయర్ పార్టీ సందడిగా ఎక్కడ జరుగుతుంది.. తెలుసుకుందామా..

Goa New Year Party


ఇండియాలోని టాప్ న్యూయిర్ సెలబ్రేటింగ్ ప్లేస్ అంటే.. గోవానే చెప్పుకోవాలి. ప్రేమాంచితం, రోమాంచితం చేసే బీచ్‌లు, లైవ్ మ్యూజిక్, నైట్ లాంగ్ పార్టీస్, చీప్ బీర్ ఇక్కడి ప్రత్యేకత. మిగిలిన పార్టీలకు భిన్నంగా పైర్ వర్క్స్ దీనికి ప్రత్యేకం.

Goa-Party

ఇక సెకండ్ ప్లేస్ గా బెంగళూరును పేర్కొనవచ్చు. ఐటీ కేంద్రంగా విరాజిల్లే బెంగళూరు పచ్చటి ప్రకృతికి, ఉద్యానవాలకూ పెట్టింది పేరు. లీలా కెంపిన్స్కీ, డుగౌట్ రూఫ్ టాప్ రెస్టారెంట్ ఇక్కడ న్యూఇయర్ పార్టీలకు పెట్టింది పేరు.

bangalore new year party

ఇక నిద్రపోని నగరంగా పేరున్న ముంబై న్యూఇయర్ పార్టీలకు టాప్‌ 3 ప్లేస్ దక్కించుకుంటుంది. సాధారణంగానే సందడిగా ఉండే ముంబై... ఇక న్యూఇయర్ పార్టీ వేళ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. భారతీయ సినీ రాజధాని కావడంతో ఇక్కడ సినీ తారల ప్రత్యేక పార్టీలూ ఎక్కువే. ప్రత్యేకించి మారియట్ హాటల్లోని లోటస్ కేఫ్, హయత్ రెగెన్సీ వంటి చోట్ల జరిగే పార్టీలకు ఆదరణ ఎక్కువ.

mumbai-nye

 ఉత్తర భారతంలో జరిగే న్యూఇయర్ వేడుకల్లో ఢిల్లీదే ఫస్ట్ ప్లేస్ అవుతుంది. పానీయల దగ్గర నుంచి పాటల వరకూ ఇక్కడ ఎంజాయ్‌మెంటే వేరు. అతి ఖరీదైన, రాజరికం ఉట్టిపడే, సంపన్నుల పార్టీలకు ఢిల్లీ పెట్టింది పేరు. ఇక్కడి ఇండియా గేట్ న్యూఇయర్ పార్టీలకు కొద్ది రోజుల ముందే నుంచే ఉత్సాహంతో ఊగిపోతుంటుంది. ఐటీసీ మౌర్య, హోటల్ సామ్రాట్, పబ్ నిర్వాణ్.. ఇక్కడి టాప్ పార్టీ వేదికల్లో కొన్ని.

Delhi2

భారతీయ సాంస్కృతిక రాజధానిగా పేరున్న కోల్‌కతా కు ఐదో బెస్ట్ ప్లేస్ దక్కుతుంది. ఆర్కిడ్ గార్డెన్, సొన్నెట్, తంత్ర, షిమ్మర్స్ లాంజ్ వంటి ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలకు ఆకాశమే హద్దు.

Kolkata5

మరింత సమాచారం తెలుసుకోండి: