ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన ఎన్నో పనులు చేపట్టారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి సిద్దమయ్యారు.  ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు ప్రభుత్వం నేడు మరో మైలు రాయిని చేరుకోబోతోంది. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 

వాస్తవానికి ఈ పరిశ్రమ పదేళ్ల క్రితమే మొదలు కావాల్సి ఉన్నా..ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఉక్కు పరిశ్రమను  పనులు మొదలు పెట్టాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ప్రస్తుతం ఇందుకు అవసరమైన లాంఛనాలను పూర్తిచేసిన ప్రభుత్వం నేడు శంకుస్థాపనకు సిద్ధమవుతోంది.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పేర్కొన్నా కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించలేదు.  దాంతో  రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్మించాలని సంకల్పించింది. ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’గా నామకరణం చేసిన ఈ కంపెనీ నిర్మాణానికి ఈ ఉదయం 11:12 గంటలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: