ఏబీఎన్- ఆంధ్రజ్యోతి.. తెలుగులో దమ్మున్న మీడియాగా పేరున్న పత్రిక, ఛానల్. తెలుగులో దాదాపు నెంబర్‌ టూ స్థానంలో ఉన్న మీడియా. ఇప్పుడు ఈ మీడియాను సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం వాడుకుంటున్నారట. ఈ మేరకు ఏపీఆర్టీసీ ఛైర్మన్, తెలుగుదేశం నేత వర్ల రామయ్య విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related image

ఇంతకూ అసలేమైందంటే.. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి లోగోలను, పేపర్, వీడియో క్లిప్పులను మార్ఫింగ్ చేసి.. ముఖ్యమంత్రి అనని మాటలను అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మీడియాలో ఈ వార్త వచ్చిందేమోనని తెలియని వారు పొరపడే ప్రమాదం ఉంది. కొంతమంది సోషల్‌ మీడియాను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని వర్ల రామయ్య అంటున్నారు.

Image result for varla ramaiah


ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలు సరికాదని.. వీటిని సహించబోమని వర్ల హెచ్చరించారు. నిజంగానే ఇటీవల ఒక్క ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు.. ఇంకా ఇతర మీడియా లోగోలను కూడా ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసేస్తున్నారు.

Image may contain: 1 person, text


ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ కామన్ అయ్యింది. అందుకే వాట్సప్, ఫేస్‌బుక్ లను వేదికలుగా మలచుకుని కొందరు దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ వాడేవారు.. సోషల్ మీడియా వార్తలను అంత సులభంగా నమ్మకూడదు. చెక్ చేసుకున్న తర్వాత కానీ వాటిని ఫార్వార్డ్ చేయకూడదు. ఈ మేరకు ఇటీవల వాట్సప్ సంస్థ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: