ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో క్యాబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయని ఆసక్తి అందరిలో నెలకొంది. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచిన కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించారు.

Image result for harish rao

రాష్ట్రంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాటి అన్నిటి విషయమై తన కొడుకు కేటిఆర్ కి అప్పజెప్పారు. ఇందుమూలంగా నే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని ఇటీవల నియమించారు కేసీఆర్.

Related image

ఇదిలా ఉండగా టిఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ మంత్రి వర్గ విస్తరణలో ఆ పార్టీ ప్రముఖ నాయకుడు హరీష్ రావు కి మంత్రి పదవి దక్కడం లేదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు, గాంధీభవన్ లో పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసినా సందర్భంలో నేడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు సంపత్.

Related image

తెలంగాణాలో రాష్ట్ర పాలన గందరగోలంగా ఉందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పేరుతో దేశం పట్టుకొని తిరుగుతున్నారని, కేటీఆర్ రాష్ట్రాన్ని, రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని, హరీష్ రావు విషయానికొస్తే తనకు మంత్రి పదవి వస్తుందో రాదో అని తల పట్టుకు ఇంట్లోనే ఉండిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: