రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలు అయ్యేందుకు బీజం పడేది ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనతో. వివిధ జిల్లాలలో అధికార పార్టీ నేతలు అంతా చంద్రబాబు ఎవరికి సీటు కన్ఫర్మ్ చేస్తాడో అని ఒకపక్క తలమునకలు అవుతుంటే, ఒక అభ్యర్థి మాత్రం దర్జాగా ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. అతనే చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. ఈయనకు నిస్సందేహంగా టికెట్ ఖరారు అయి మొదటి విడతలో మొట్టమొదటి పేరు ఇతనిదే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Image result for chandrababu
అయితే ఎవరి ఊహలకు అందకుండా చివరి వరకు తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకునే బాబు కి ఇంకొక దారి లేకుండా చేసిన ఈ పవర్ లీడర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈయన ఎంతలా ఎదిగాడంటే 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుండి ఘనవిజయం సాధించేంతగా. జిల్లాలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఇతనిని కాదని ఇంకొక అభ్యర్థికి అవకాశం ఇచ్చే ఆలోచన ఇంక బాబు కి ఎలా వస్తుంది ?
Image result for chandrababu aamanchi
ఇతని టికెట్ ఇవ్వడం వల్ల బహుప్రయోజనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇతను జిల్లాలోని ఇతర పార్లమెంటు స్థానాలను తన సామాజిక వర్గం అండతో ప్రభావితం చేయగల సామర్ధ్యం ఈయన సొంతం. అందుకే జాతీయ చేనేత దినోత్సవం అప్పుడు చంద్రబాబు కూడా ఈసారి మీ అభ్యర్థిని మళ్లీ గెలిపించుకొండి అని ఆమంచిని ఉద్దేశించి అన్నారు.
Related image
ఇక ఈయనకున్న పేరుతో భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనే చెప్పాలి. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈయన సాధించిన, సంపాదించుకున్న ఉనికిని చూసి ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు దిద్దుతున్న ఎందరో యువనేతలు నేర్చుకోవాల్సింది చాలనే ఉంది..!


మరింత సమాచారం తెలుసుకోండి: