షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే రాజధాని జిల్లా గుంటూరులో తెలుగుదేశంపార్టీ కూడా మంగళగిరిలో కొత్త నేతను సిద్ధం చేస్తోందని సమాచారం. కొత్త నేతంటే రాజకీయాలకు కొత్తకాదు లేండి. అయితే టిడిపికి మాత్రం కొత్తనే చెప్పుకోవాలి. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కమల ప్రజారాజ్యంపార్టీ అభ్యర్ధి తమ్మిశెట్టి జానకీదేవిపై పెద్ద మెజారిటితోనే గెలిచారు. అయితే, 2014లో రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ నేతల్లో చాలామందికి లాగే కమల కూడా తెరమరుగైపోయారు.

 Image result for alla ramakrishnareddy

షెడ్యూల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా ? అందుకనే మళ్ళీ యాక్టివ్ అవుదామని అనుకున్నారు. అయితే, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కోలుకునే అవకాశాలు లేవన్న ఉద్దేశ్యంతో ఈమధ్యే చంద్రబాబునాయుడును కలిశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో చంద్రబాబును కలిశారంటేనే కారణం అర్ధం చేసుకోవచ్చు.  వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున మంగళగిరిలో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే చంద్రబాబును కలిశారనటంలో సందేహం లేదు. దానికితోడు మంగళగిరిలో టిడిపికి గట్టి నేతలు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాటిని టిడిపి నేతలెవరూ తట్టుకునే పరిస్ధితి లేదు.

 Image result for alla ramakrishnareddy

 అందుకనే మంగళగిరి నుండి టిడిపిలో చేరటానికి కమల ఉత్సాహం చూపగానే చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. కాబట్టి పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై టిడిపి తరపున పోటీకి కమల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మంగళగిరిలోని సుమారు 2.5 లక్షల ఓట్లలో ఎస్సీ, బిసి, (చేనేత) సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువ. కమల కూడా చేనేత ఉపకులానికి చెందిన నేతే కావటం గమనార్హం. పైగా కమల వియ్యంకులు మురుగుడు హన్మంతరావు రెండుసార్లు ఎంఎల్ఏతో పాటు మాజీ మంత్రి కూడా. కాబట్టి వైసిపి అభ్యర్ధి ఆళ్ళపై కమల అయితే సులభంగా గెలుస్తారనే అంచనాలో ఉంది టిడిపి. మంచిరోజు చూసుకుని పార్టీలో చేరటానికి కమల కూడా రెడీ అవుతున్నారు. మరి చూద్దాం చంద్రబాబు ఏం చేస్తారో ? ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: