తెలంగాణ ఎన్నికల్లో వంద స్థానాల్లో గెలుస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా సెంచరీ మార్కు మాత్రం దాటలేకపోయారు. కానీ కొన్ని ఎన్నికల గుర్తుల వల్లే వంద స్కోరు దాటలేకపోయామని టీఆర్‌ఎస్ వర్గాలు ఫీలవుతున్నాయి.

Related image


ప్రత్యేకించి ట్రక్కు, టోపీ, కెమేరా, ఇస్త్రీపెట్ట వంటి గుర్తుల కారణంగా కనీసం 7,8 స్థానాలు కోల్పోయాని ఆ పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. ఈ నాలుగు గుర్తులు కారు గుర్తును పోలి ఉండటమే ఇందుకు కారణం. ట్రక్కు గుర్తుకు చాలా చోట్ల వేల సంఖ్యలో ఓట్లు రావడం ఈ వాదనను బలపరుస్తోంది.

Related image

అందుకే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఇదే నష్టం తిరిగి జరగకుండా టీఆర్‌ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుతో శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఏడు చోట్ల ఓడిపోయిందని కేసీఆర్ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సీఈసీని కలిసిన కేసీఆర్ తమ పార్టీకి జరిగిన నష్టాన్ని వివరించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, టోపీ గుర్తులతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వేల సంఖ్యలో ఓట్లు కోల్పోయారని ఫిర్యాదు చేశారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఈ గుర్తులను ఏ పార్టీలకు, అభ్యర్థులకు కేటాయించొద్దని కేసీఆర్ ఈసీని కోరారు. పనిలో పనిగా తమ కారు గుర్తుకు రంగును మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈసీ ఈసారైనా టీఆర్‌ఎస్ విజ్ఞప్తిని పరిశీలిస్తుందో లేదో..?


మరింత సమాచారం తెలుసుకోండి: