ఈ మద్య పెద్ద నగరాల్లో దొంగలు రక రకాల పద్దతులు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు చికట్లో దొంగతనాలు చేసేవారు..ఇప్పుడు పట్టపగలే రెచ్చిపోతున్నారు.  నిర్మాణుష్యంగా ఉన్న ప్రదేశాల్లో ఆడవారిని టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ కి పాల్పపడుతున్నారు.  గతంలో హైదరాబాద్ లో ఈ గ్యాంగ్ బాగా రెచ్చిపోయినా.. పోలీసులు కట్టడి చేశారు.  ఈ మద్య మరోసారి చైన్ స్నాచ్ దొంగలు రెచ్చిపోతున్నారు. బుధవారం ఐదు చోట్ల గొలుసులు లాక్కెళ్లిన దుండగులు, గురువారం 40 నిమిషాల వ్యవధిలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు.
Image result for చైన్ స్నాచింగ్
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల, వనస్థలిపురం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో చోట చోరీలకు పాల్పడ్డారు. మొత్తంగా 12.5 తులాల బంగారు గొలుసులను మహిళల మెడల్లోంచి తెంపుకెళ్లారు. అయితే యూపీకి చెందిన దొంగల ముఠా అక్కడి నుంచి విమానంలో వచ్చి మరీ హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. బైక్‌పై వచ్చిన దొంగల్లో ఒకడు పసుపు చొక్కా ధరించగా, మెడలో రుమాలు కట్టుకున్నట్టు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.

బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నట్టు బాధితులు తెలిపారు.  వనస్థలిపురంలో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న మహిళ మెడలోని నాలుగు తులాల చైను లాక్కెళ్లిన దుండగులు, మన్సూరాబాద్‌లోని లెక్చరర్స్ కాలనీలో ఇంటిబయట వేచి చూస్తున్న మహిళ మెడలోని గొలుసును తెంపుకెళ్లారు. ఈ ఘటనలకు తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం...దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది.  రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: