ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత రాజకీయ చాణక్యుడు ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ టీడీపీ నేతలకు భయం పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో సదరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని 2019 ఎన్నికల టికెట్ కేటాయింపుల విషయం ఉంటుందని చంద్రబాబు ఇటీవల టిడిపి నేతల వీడియోకాన్ఫరెన్స్లో తెలియజేయడంతో చాలా మంది టీడీపీ అభ్యర్థులు భయాందోళనలో పడ్డారు.

Image result for chandrababu

ఈ నేపథ్యంలో కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో వీడే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. ఇన్నాళ్లుగా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధాన‌ల‌ను చూసీ చూడ‌న‌ట్టు పోయిన కొంత మంది ఎమ్మెల్యేలు బాబు త‌న జాబితాను ప్ర‌క‌టించ‌క‌ముందే పార్టీని వీడాల‌ని అప్పుడే స్కెచ్‌ వేశార‌ని స‌మాచారం.

Related image

టీడీపీ నుంచి జ‌న‌వ‌రిలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌తో పాటు వైసీపీలో చేరే అవ‌కావం వుంద‌ని, ఇదే జ‌రిగితే ఏపీలో చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Related image

ఇప్పటికే ఎన్నికల ముందు తెలంగాణలో వచ్చిన వోటమి ఆంధ్రాలో ఎఫెక్ట్ చూపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఇంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే కచ్చితంగా చంద్రబాబు కి భారీ ఎఫెక్ట్ ఉంటుందని పచ్చిగా చెప్పాలంటే అభ్యర్థులు కూడా రానున్న ఎన్నికల్లో దొరికే అవకాశం ఉండదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: