తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాగానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ కు యజ్ఞ, యాగాదులపై విపరీతమైన నమ్మకం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో రాజ్య శ్యామల యాగం నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో యాగం నిర్వహించబోతున్నారు.


కేసీఆర్ మరో మహాయాగం.. ఇది దేని కోసమో..?


ఇటీవల కేసీఆర్ విశాఖ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రెండోసారి తెలంగాణ సీఎం అయ్యాక స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. మరో యాగం కూడా ఈయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారుట. వైజాగ్ టూర్ లోనే ఈ యాగానికి సంబంధించి ఇరువురూ చర్చించుకున్నారు.


కేసీఆర్ మరో మహాయాగం.. ఇది దేని కోసమో..?


ఈ కొత్త యాగం ముహూర్తం ఈనెల 21 కావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేయనున్నారు. ఐతే... ఈసారి చేసేది ఏ యాగం అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా అది సహస్ర ఆయుత చండీ మహాయాగం కావచ్చని తెలుస్తోంది. 2015 డిసెంబరులో కూడా కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఆయుత చండీయాగం నిర్వహించారు.


కేసీఆర్ మరో మహాయాగం.. ఇది దేని కోసమో..?

మరోవైపు ఈ కొత్త యాగం దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ తాజాగా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు తీవ్రం చేసిన నేపథ్యంలో ఆ ఫ్రంట్ ప్రయత్నం దిగ్విజయం కోసమే ఈ యాగం చేస్తుండవచ్చన్నది మరో వాదన. యాగం చేసిన ప్రతిసారీ విజయం సాధించడం కేసీఆర్ కు ఆనవాయితీగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: