ఆ డేట్ ఇపుడు వైసీపీని తీవ్రంగా కలవరపెడుతోందట. ఆ రోజున ఏం జరుగుతుందోనని నాయకులు కంగారు పడుతున్నారట. తమ జాతకం ఎలా ఉంటుందోనని ఒకటికి పదిమార్లు ప్రశ్నంచుకుంటున్నారుట. మరి ఫ్యాన్ పార్టీ నేతలను ఇంతలా ఆందోళనపరుస్తున్న ఆ డేట్ ప్రత్యేకత ఏంటి.


పాదయాత్ర ముగింపు :


జనవరి తొమ్మిది, ఇచ్చాపురం వేదికగా జగన్ పాదయాత్ర ముగింపు భారీ ఎత్తున జరగనుంది. పద్నాలుగు నెలల పాటు నిర్విరామంగా జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగింపు అదిరిపోవాలని జగన్ భావిస్తున్నారుట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇదే సభలో జగన్ కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తారట. అవే ఇపుడు పార్టీ నాయకులను కలవరపెడుతున్నాయట.


అందరికీ ఆహ్వానం :


పార్టీకి చెందిన మొత్తం 175 అసెంబ్లీ సీట్ల ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులందరినీ జగన్ ఆ రోజున రమ్మని పిలిచారుట. ఆ స‌భ‌తో పాటుగా పాద‌యాత్ర గుర్తిండిపోయేలా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం ఆ స‌భ వేదిగా జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా గురించి ఢిల్లీలో సైతం వైసిపి నిర‌స‌న దీక్ష చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ ఆ స‌భ‌లో ఏపి కి ప్ర‌త్యేక హోదా అంశంతో పాటుగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతోంది.


అభ్యర్ధుల ప్రకటన :


ఇక ఇప్ప‌టికే ఏపిలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పరిస్థితిం సామాజిక స‌మీక‌ర‌ణాలు పోటీలో ఉన్న అభ్య‌ర్ధులు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని జ‌గ‌న్ ప‌లు కోణాల్లో స‌ర్వేలు చేయించారు. ఆ స‌ర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా కొన్ని చోట్ల పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చారు. అవి కొన్ని చోట్ల వివాదాల‌కు దారి తీసినా..వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఇచ్ఛాపురం స‌భ ద్వారా పార్టీ నుండి టిక్కెట్లు ద‌క్కించుకొనే వారి పేర్లు ప్ర‌క‌టిస్తార‌ని అంచనా వేస్తున్నారు.  ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లే చాలా చోట్ల ఆభ్య‌ర్ధులుగా ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో..వారి పేర్ల‌ను ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. అదే విధంగా లోక్‌స‌భ స‌భ్యుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్న స‌మాచారం. 
ఇప్ప‌టికే టిడిపి అధినేత సైతం జ‌న‌వ‌రి చివ‌రిలోగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. దీంతో.. ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చాపురం వేదిక‌గా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి..కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేస్తార‌ని తెలుస్తోంది. దీంతో..వైసిపి ఆశావాహుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మొత్తానికి జగన్ ఎవరి పేరు ప్రకటిస్తారో, ఎవరిని పక్కన పెడతారోనని నేతలంతా బేజారవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: