అతి సున్నితమైన న్యాయ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హడావిడిగా సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించాలని కేంద్రం నిర్ణయించాడన్ని ఆయన తప్పుబట్టారు. జనవరి 1 నుంచి ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ మొన్న కేంద్రం గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Image result for ap high court

ఏమాత్రం సమయం ఇవ్వకుండా హడావిడిగా హైకోర్టును విభజించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు- టీడీపీ ప్రభుత్వ పాలనపై ఇటీవల వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు ఇవాళ ఆరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన జగన్ కేసుల అంశంపై స్పందించారు.

Image result for jagan cbi cases

కేంద్రం సరైన సంప్రదింపులు జరపకుండానే హైకోర్టును విభజించిందని చంద్రబాబు తప్పుబట్టారు. పట్టుమని పది రోజులు కూడా సమయం ఇవ్వకుండా జనవరి 1నే వెళ్లిపోవాలని హడావిడి పెట్టడమేంటని చంద్రబాబు కామెంట్ చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే.. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే హడావిడిగా విభజన చేసినట్టుగా ఉందన్నారు చంద్రబాబు.

Image result for jagan cbi cases

హైకోర్టు విభజన కారణంగా నాంపల్లి సీబీఐ కోర్టు విభజన చేయాల్సి ఉంటుందని.. జగన్‌ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని చంద్రబాబు అన్నారు. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని... ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి జగన్ కేసులు విచారణ చేపట్టాల్సి ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. సహజంగా న్యాయవ్యవస్థపై కామెంట్ చేయని చంద్రబాబు కేంద్రం వైఖరిని తప్పుబట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: