నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ కి కంచు కోట అని వేరే చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో కడప తో పాటు అత్యధిక స్థానాలను ఈ జిల్లే వైస్సార్సీపీ కి కట్ట బెట్టింది. అయితే ఇప్పడూ 2019 లో కూడా వైస్సార్సీపీ కే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బలమైన నాయకులూ వైస్సార్సీపీ లో చేరినారు . అయితే నెల్లూరు ఎంపీ భరిలో దిగడానికి ఎవరు ముందు కు రావడం లేదని వినికిడి. ఎందుకంటే నెల్లూరు లో వైస్సార్సీపీ కి బలం ఎక్కువగా ఉందని విజయావకాశాలు తక్కువని వారి అభిప్రాయం . 

Image result for chandra babu and jagan

అయితేఇటు ప్రధాన పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీలో ఒకట్రెండు నియోజక వర్గాలు మినహా మిగిలిన 8 నియోజకవర్గాల్లో సిట్టింగులనే బరిలోకి దించాలని ఆ పార్టీ అధ్య క్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసు కున్నప్పటికీ కొత్త నాయకుల చేరికతో ఆ పార్టీలో మునుపెన్నడూ లేనివిధంగా అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిలు వైసీపీలో చేరడంతో గూడూరు డివిజన్‌తో పాటు జిల్లాలోని సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మరింత బలం పెరిగినట్లయింది.

Image result for chandra babu and jagan

అయితే గూడూరు టిక్కెట్‌ కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులు పట్టుబడుతుండడంతో కొత్తగా ఆ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటికీ బయటపడుతున్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆ పార్టీ తరపున తిరిగి రెండోసారి పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడంతో ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కొత్తగా ఆవిర్భవించిన జనసేన పార్టీ రె డ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని రంగంలోకి దించితే సమీకరణాలు మారే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: