రాయికి మొక్కితే ఫలితం ఉంటుందో ఉండదో తెలియదు కానీ మనశ్సాంతి మాత్రం దక్కుతుంది. రాయికి అంతటి ప్రభావం ఉంది. మరి అటువంటి రాళ్ళను నమ్ముకోవడం రాజకీయ నాయకులకు ఎప్పటి నుంచో అలవాటు. రాళ్ళే రత్నాలై కాగల కార్యాన్ని నెరవేరుస్తాయన్నది సగటు రాజకీయ నేతల గట్టి విశ్వాసం


చంద్రన్న రాళ్ళు :


ఇది కొత్త పధకం అనుకుంటున్నారా. అవును నిజమే ఏపీలో ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు అమలవుతోంది. ఈ పధకం వల్ల ప్రయోజనం మాత్రం అచ్చంగా  ఏలిన ప్రభువులకే దక్కుతుందన్నమాట. అంటే లబ్దిదారులు వారేనని అర్ధం. ఇంతకీ ఈ రాళ్ళ పధకం ఏంటంటే హడావుడిగా నాలుగు పునాది రాళ్ళు తీసుకువచ్చేసి పాతేయడం. దానివల్ల  పోయేది ఏమీ లేదు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అంతకంటేలేదు, జనాలకు మాత్రం త్రీడీ సినిమా చూపించేయవచ్చు. కొంతమందైన నమ్మినా చాలు ఓట్ల పంట పండడం ఖాయం.

 ఈ విధంగా ఆలోచించి  చేసిందే కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపన అంటున్నారు. దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజేక్ట్ ఇది. ఎన్నికలు చూస్తే మూడు నెలలు కూడా గట్టిగా లేవు. ఈ టైంలో ఇంతటి భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారంటే కచ్చింతాంగా ఎన్నికల జిమ్మిక్కేనని విపక్షాలు అంటున్నాయి. బీజేపీ నేత జీవీల్ నరసిమ్హారావు అయితే ఇవి అచ్చంగా చంద్రన్న రాళ్ళు అనేశారు, వైసెపీ నేత విజయసాయిరెడ్డి అయితే ఇది చంద్రబాబు అడుతున్న నాటకమని, తన బినామీ అయిన సీఎం రమేష్ కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పుకొచ్చారు.


అదీ అంతేనా :


ఇక అమరావతిలో సచివాలయ భవనాలకు శంకుస్థాపన కూడా అచ్చంగా అంతే. అయిదేళ్ళ కాలమంతా టెంపరరీ భవనాలకే వెచ్చించిన ప్రభుత్వం ఎన్నికల వేళ ఏదో చేసామని చెప్పుకోవడానికే ఈ విధంగా హడావుడి చేస్తున్నారని విపక్షాలే కాదు సామాన్య జనం కూడా అనుకున్నా తప్పేముంది. ఇక విశాఖ ఉత్సవ్ కి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాత పాటనే మళ్ళీ పాడారు, విశాఖను సినిమ రాజధాని చేస్తామని, టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని భారీ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అదే విధంగా విశాఖ సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. మొత్తానికి పదవీ కాలం ముగుస్తున్న వేళ ఇస్తున్న ఈ హామీలు ఓట్ల గేలానికేనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: