ఫీవర్ అన్నది మనిషికి ఎపుడో కానీ రాదు. అదే రాజకీయ జీవులకు మాత్రం మూడువందల అరవై అయిదు రోజులూ వస్తూనే ఉంటుంది. ఏదో సమస్య పెట్టుకోవడం ఫీవర్ తెప్పించడం, తెచ్చుకోవడం రెండూ పార్టీలకే చెల్లు. ఇపుడు చూస్తే రెండు రోజుల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్నాం. దాంతో పాటే కొత్త జ్వరాలను కూడా పార్టీలు తెస్తున్నాయి.


బాబు ముహూర్తం:


ఇక ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నడూ లేని విధంగా అభ్యర్ధులను ముందే ప్రకటిస్తామని చెప్పుకువస్తున్నారు. అనడమే కాదు దానికి కార్యాచరణ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ముహూర్తాన్ని కూడా సిధ్ధం చేశారని అంటున్నారు. అన్నీ కలసివచ్చే ముహూర్తంగా జనవరి 17ని ఎంచుకున్నారని టాక్ నడుస్తోంది. ఆ రోజున తొలి జాబితా ప్రకటిస్తే తిరుగు ఉండదని అంటున్నారట. దాంతో టీడీపీ ఆశావహులు జ్వరంతో హీటిక్కిపోతున్నారు.


జగన్ దీ అదే రూట్ :


ఇక వైసీపీ అధినేత జగన్ కూడా జనవరిలోనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నార్. ఆయన పార్టీ కీలక మీటింగును ఇచ్చాపురంలో పెట్టారు. ఆ రోజున జగన్ ఏం చెబుతారో అన్న టెన్షన్ తో వైసీపీ నేతలు ఫీవర్ తో అపుడే వేడెక్కిపోతున్నారు. జగన్ ఎవరికి షాక్ ఇస్తారో మరెవరికి చోటు ఇస్తారో తెలియక ఆశావహులకు నూటొకటి పలుకుతోంది. మరి నిజంగా అనుకున్నట్లుగా ఆ రోజున అభ్యర్ధుల లిస్ట్ ప్రకటిస్తారా లేక క్లాస్ తీసుకుంటారా అన్నది  చూడాలి


మేమూ రెడీ :


ఈ రెండు పార్టీలతో పాటుగా తానూ రంగంలో ఉన్నానని అంటున్న జనసేన కూడా సంక్రాంతి తరువాతనే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ దీనిపై విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ తొందరలోనే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని, మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ పెడతామని చెప్పుకొచ్చారు. మరి ఇలా ఒకేసారి మూడు పార్టీలు బుకింగ్ ఓపెన్ చెస్తే ఆశావహులలో ఆందోళన బాగా పెరిగిపోతోంది. ఒక చోట టికెట్ రాకపోతే ఇంకో పార్టీ అని ఎంచుకునేందుకు లేకుండా అంతా ఒకేమారు గొంతు సవరించుకుంటే కష్ట‌మేనని టికెట్లు ఆశిస్తున్న వారు అంటున్నారు. మొత్తానికి జనవరిలో  చలి కంటే పార్టీల నేతలే ఎక్కువగా చలి పెంచుతున్నారట. అందుకే జ్వరాలు వచ్చేస్తున్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: