తెలుగుదేశం పార్టీ ఎవరిది అంటే ఇప్పటితరం మాత్రం చంద్రబాబుది అని ఠక్కున చెబుతారు. పైగా అడిగిన వాడికి బుర్ర లేదా అని అనుమానంగా కూడా చూస్తారు. మరి అన్న నందమూరి పెట్టిన పార్టీ కదా అని ఎవరైనా అంటే అవునా అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తారు. అలా అన్న గారి టీడీపీ ఇపుడు బాబు మార్క్ పార్టీగా బలమైన ముద్ర వేసుకుంది. మరి ఈ ఇద్దరూ కాక అసలు టీడీపీ నాది అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి ఒకాయన. 


పార్టీయే నాది :


దాదాపుగా మూడున్నర దశాబ్దాల వెనక్కు వెళ్తే అప్పట్లో నాదెండ్ల భాస్కరరావు నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా చేసిన సందర్భం చరిత్ర పుటల్లో దాగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీని అన్న గారు స్థాపించడం తొమ్మిది నెలల్లోఅ అధికారంలోకి రావడం, ఆయన మంత్రి వర్గంలో కో పైలెట్ గా నాదెండ్ల వ్యవహరించడం, చివరికి 1984 ఆగస్ట్ ఎపిసోడ్ లో నాదెండ్ల భాస్కరరావు అన్న గారిని కూలదోసి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తరువాత జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో తిరిగి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు.

ఇదంతా ఇపుడు అన్న గారి బయోపిక్ లో చూపించబోతున్నారట. దీనిపై మండిపడుతున్న నాదెండ్ల భాస్కరరావు అసలైన తెలుగుదేశం పార్టీ నాదేనని అంటున్నారు. తన మీద తప్పుడుగా ముద్ర వేసి సినిమాలో చూపిస్తే చూస్తూ ఊరుకోనని ఛెబుతూ, సంబందిత చిత్ర యూనిట్ కు చెందినవారికి నోటీసులు పంపినట్లు  నాదెండ్ల  చెప్పారు. సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ , సెన్సార్ బోర్డు సభ్యులకు నోటీసులు పంపించినట్లు వివరించారు.టిడిపి పార్టీ పెట్టిందే తాను అని ఆయన అన్నారు.


విలన్ గా చూపిస్తే ఊరుకోను :


ఇక అన్న గారి బయోపిక్ లో తనను విలన్ గా చూపిస్తే ఊరుకునేది లేనే లేదని నాదెండ్ల కచ్చితంగా చెప్పారు. దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్తానని హెచ్చరిస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీని పెట్టిందే తాను అంటూ సంచలన స్టేట్మెంట్ కూడా నాదెండ్ల ఇచ్చారు. ఈ సినిమా తీసే విషయంలో తనను ఎవరూ కలిసిందీ కూడా లేదని యూనిట్ సభ్యులపై ఫెయిర్ అయ్యారు. . రాజకీయ అవసరాల కోసం తనను విలన్ చూపించే ప్రయత్నాలు జరిగిగే ఊరుకోబోనని ఆయన అన్నారు. తనను నెగిటివ్ గా చూపిస్తున్నారన్ సమాచారం వచ్చిందని నాదెండ్ల చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: