తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రాధ్యాన్యత అందరికీ తెలిసిందే. వారసులుగా నాగార్జున, ఆయన తనయులు ఇపుడు టాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అయితే అక్కినేని కుటుంబం సినిమాల్లోనే ఉంటూ వచ్చింది తప్ప రాజకీయాల్లో మాత్రం ఎపుడు దూరం పాటిస్తూనే ఉంది. అన్న గారు పార్టీ పెడుతూ తనతో కలసి రమ్మని అక్కినేని నాగేశ్వరరావుని పిలిచారు కానీ ఆయన సున్నితంగా నో చెప్పేశారు. మరి ఆ తరువాత తరంలో తండ్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న నాగార్జున ఇపుడు ఏం చేయబోతున్నారు.


జగన్ పార్టీలోకి :


వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు సినిమా స్టార్స్ ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ వద్దనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్ గా వైసీపీ కనిపిస్తోంది. ఇకపోతే నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చాలాకాలంగా న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది. ఆయన వైసీపీ లో చేరుతారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్న వేళ నాగ్ ఫ్యామిలీ ఈసారి తప్పనిసరిగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందని అంటున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితునిగా ఉన్న నాగార్జున ఎంపీగా పోటీ చేస్తారని న్యూస్ వస్తోంది. ఆయన కాకపోతే సతీమణి అమలను రాజకీయాల్లోకి దించుతారని అంటున్నారు. 



అమలను గుంటూరు, విజయవాడల్లో ఏదో ఒక ఎంపీ సీటు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఇదే నిజం అయితే అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. ఏయన్నార్ కు ఉన్న ఫాలోయింగ్ ఇపుడు వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఓ వైపు బాలయ్య టీడీపీలో ఉంటే, పవన్ ఏకంగా సొంత పార్టీతో నుంచి పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ వైసీపీ వెనక ఉంటే మాత్రం ఏపీలో సినీ రాజకీయం ఓ రేంజిలో ఉంటుందనడంలో సందేహమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: