ఉమ్మడి హైకోర్టు విభజన అడ్డగోలుగా చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. హైకోర్టును ఏపీకి తీసుకెళ్ల వద్దని, ఇక్కడే ఇంకో భవనం చూసుకోమని తాము చెబితే, డిసెంబర్‌ లోగా వెళ్లిపోతామని సుప్రీంకోర్టుకు అఫిడివిట్‌ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా! అని కేసీఆర్‌ ప్రశ్నించారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టిన కేసీఆర్ "చంద్రబాబు మనిషిలాగే మాట్లాడుతున్నారా! హైకోర్టును ఏపీకి తీసుకెళ్లరాదని, ఇక్కడే ఇంకో భవనం చూసుకోవాలని మేము చెప్పాం. కాదు కాదు డిసెంబర్‌ లోపే వెళిపోతామని సుప్రీంకోర్టుకు మీ ప్రభుత్వం అఫిడివిట్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కేంద్రప్రభుత్వం నోటిఫై చేసి హైకోర్టు విభజనకు అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడేమో అడ్డుగోలుగా హైకోర్టు విభజన అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నావ్‌! నీకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. 
KCR Slams Chandrababu Naidu - Sakshi
"ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని ఒకటి రెండు తోక పత్రికలు తనకు వంత పాడితే సరిపోతుందా? చంద్రబాబు తరహా దిగజారుడు చేసే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎక్కడా ఉండడు. చంద్రబాబు మాటలకు తలాతోకా ఉందా. నాలుగేళ్లు నరెనద్ర మోదీ సంకనాకావ్‌! ఏ ముఖం పెట్టుకుని నరేంద్ర మోదీతో జతకట్టావ్‌!. ఎందుకు బయటకొచ్చావ్‌! ప్రత్యేక హోదా అవసరమే లేదన్నవ్‌! ప్యాకేజీ కావాలన్నవ్‌! హోదా సంజీవిని కాదన్నవ్‌! ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైల్లో వేస్తానన్నావ్‌! మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదాపై కేంద్రం అన్యాయం చేసిందంటున్నవ్‌! చంద్రబాబు మనిషిలాగే మాట్లాడుతున్నారా? "చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌" ఖచ్చితంగా ఉంటుంది జాగ‍్రత్త! చంద్రబాబు ఒక దద్దమ్మ. మా ఇండస్ట్రీయల్‌ పాలసీని చంద్రబాబు దొంగిలించాడు. చంద్రబాబు దుర్మార్గుడు పచ్చి అబద్ధాల కోరు అని పునరుద్ఘాటించారు. 
kcr comments on chandrababu కోసం చిత్ర ఫలితం
సైబర్‌-టవర్‌కు పునాది వేసింది బాబు కాదు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఓడిపోతాడు. చంద‍్రబాబుకు విలువల్లేవ్‌! నేను ప్రతిపాదించిన "ఆర్థిక నమూనా"  గురించి చంద్రబాబుకు కనీస అవగాహన కూడా లేకుండా పోయింది. ఐటీలో కూడా చంద్రబాబు ఇప్పటివరకు కూడా పీకిందేమీ లేదు. లేనిపోనివి ఆపాదించుకోవడం, రంగులు పూసుకోవడం చంద్రబాబుకే చెల్లింది" అంటూ నిప్పులు చెరిగారు.
సంబంధిత చిత్రం
అంతేకాదు హైకోర్టు విభజన గురించి పార్లమెంట్‌ లో పోరాడింది తామేనని, మరో ఐదేళ్లలో స్వంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తెలిసినా హైకోర్టు ఏర్పాటు చేసుకోలేదని ఆయన విమర్శించారు. తాము హైదరాబాద్ నుంచి ఎక్కడికీ వెళ్లమని చేప్పలేదని, డిసెంబర్ నాటికి వెళ్లిపోతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఇప్పుడు తమని అడ్డగోలుగా పంపారనడం వారి కుటిల రాజకీయమని ఆయన పునః ప్రసంగించారు. 
kcr comments on chandrababu కోసం చిత్ర ఫలితం 
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏ ముఖం పెట్టుకుని అన్యాయంగా తలుపులేసి విడగొట్టిన రాష్ట్రానికి వస్తారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, నేడు అదే మాటను బిజెపి నాయకుడు దేశ ప్రధాని మోదిని అంటున్నారని అన్నారు. చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రిని భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతి లెత్తి మొక్కాలని అన్నారు. తాను ఎవరిని కలిస్తే చంద్రబాబుకు ఎందుకని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఎవరితో అవసరమే లేదని చంద్రబాబే అన్నారని, తాము ఏపీ ప్రత్యేక హోదాకు ఎప్పుడూ అడ్డు పడలేదని కేసీఆర్ అన్నారు.

return gift to chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: