చంద్ర బాబు మీద కేసీఆర్ విమర్శలు ఆకాశాన్ని అంటాయి అని చెప్పాలి. మైకు తీసుకోని చెడ మడ తిట్టేశాడు . ఈ సారి ఇంకా డోస్ పెంచాడు అని చెప్పాలి. కేసీఆర్ ఏమన్నాడంటే , బాబుకు మెడకాయ మీద తలకాయ ఉందా.. అసలు ఆయనకు మెదడు ఉందా. రాష్ట్రం విడిపోయిన తర్వాత వెంటనే హైకోర్టు పెట్టుకోవాలి. ఐదో ఏడు నడుస్తోంది. ఇప్పటివరకు ఏం చేశాడు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతాడని చంద్రబాబు అనుకుంటాడు. దానికి డబ్బా కొట్టడానికి అడ్డమైన పేపర్లు ఉన్నాయి. నాలుగేళ్లు మోడీ సంక నాకినావ్. అప్పుడు నువ్వు చెబితే మేం మోడీకి డబ్బా కొట్టాలా. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అయితాది. వెంటనే రాహుల్ సంక నాకుతావ్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు మేం డబ్బా కొట్టాలా." 

Image result for kcr

బాబులా పచ్చి అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు కేసీఆర్. ఒకప్పుడు రాహుల్ ను విమర్శించిన అదే నోటితో ఇప్పుడు మోడీని విమర్శిస్తున్నారని, చంద్రబాబుకు ఓ పాలసీ, మాట మీద నిలబడే తత్వం లేవన్నారు. తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ కూతుర్ని నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం అన్నారు. వాడుకొని వదిలేయడం లో చంద్రబాబు నంబర్ వన్. అమాయకురాలైన హరికృష్ణ బిడ్డను తెచ్చి కూకట్ పల్లిలో నిలబెట్టాడు. హరికృష్ణ శవం మీద పేలాలు ఏరుకున్న రాజకీయం చేశాడు బాబు. ఇప్పుడా అమ్మాయికి ఏమైనా చేస్తావా? నీకు నిజాయితీ ఉందా? అప్పటివరకు హరికృష్ణను, ఆయన బిడ్డను పట్టించుకోలేదు.

Image result for chandrababu

ఆయన చనిపోగానే, దాని మీద సొమ్ము చేసుకునే ఉద్దేశంతో, సింపతీని సొమ్ము చేసుకోవడానికి హరికృష్ణ బిడ్డను దించుతాడా? ఇంతకంటే నీచత్వం ఉంటుందా? ఇప్పుడా అమ్మాయికి కచ్చితంగా ఏమీ చేయడు. పనికొస్తే వాడుకుంటాడు లేదంటే వదిలేస్తాడు."  పచ్చి స్వార్థపరుడివి నీవు. నీ రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతావు. దేన్నయినా బలితీసుకుంటావ్. నీకు ఒక విలువ లేదు. నువ్వే హోదా వద్దాంటావ్, నువ్వే హోదా కావాలంటావ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని ఎలాగోలా నడుపుతున్నావు. నువ్వు లీడర్ కాదు, నువ్వు జస్ట్ మేనేజర్ వి. ఏదైనా చేయాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఇద్దరు ఎంపీల్ని పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చాను. నువ్వేమో పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండి చక్రం తిప్పుతానంటున్నావు. సిగ్గుందా నీకు. నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చేయను."

మరింత సమాచారం తెలుసుకోండి: