ఇటువంటి కామెడీ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అనుకూల వర్గం చాలా ప్రయత్నం చేస్తుంది. దీనితో అర్ధం పర్ధం లేని న్యూస్ ను జనాల్లోకి వదులుతున్నారు. జగన్ తో చిరంజేవి భేటీ అవ్వడం ఏంటి అది కూడా జగన్ నివాసం లో ... చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చిరంజీవి జగన్ అనుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో జనసేన వైసీపీ కలిసి పోటీ చేస్తే అధికారం కన్ ఫర్మ్ అని డిసైడ్ అయ్యారట. పవన్ తరపున చిరంజీవి వచ్చాడని… ఇందుకు జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని కథలు అల్లేశారు. 

Image result for jagan and chiranjeevi

ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ జోక్.. బాగా వైరల్ అవుతోంది. అంతెందుకు రెండు వారాల క్రితం.. వైసీపీ కీలక నేతలను నాగబాబు హైదరాబాద్ లో కలిశారని వార్తలు పుట్టించారు. ఆ తర్వాత ఇది కాస్తా ఫేక్ అని తేలిపోయింది. అయినా సరే.. ఎలాగొలా జగన్ జనసేన రెండూ కలిసిపోయాయన్న ఫీలింగ్ ఏపీ ప్రజల్లో తెచ్చేందుకు.. టీడీపీ అనుకూల వర్గం బాగా కష్టపడుతోంది. అందుకే.. ఇలాంటి అర్థం పర్థం లేని వార్తల్లో ప్రజల పై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.


వారం రోజుల నుంచి జగన్ పాదయాత్రలో ఉన్నారు. మెగాస్టార్ మొన్న వీవీఆర్ ఆడియో కు వెళ్లారు. నిన్న కేశినాని నాని కూతురు పెళ్లికి అటెండ్ అయ్యారు. ఒకవేళ.. నిజంగా చిరంజీవి జగన్ లోటస్ పాండ్ లో కలుసుకుని ఉంటే.. కనీసం 100 కెమెరాలు షూట్ చేసేవి. ఒకవేళ వీడియోలు ఆడియోలు లేకపోయినా.. చిన్న లీకు వచ్చినా చాలు పెద్ద బ్రేకింగ్ తో హడావుడి చేసే చానెళ్లు మన దగ్గర బోలెడన్నీ ఉన్నాయి. ఎన్నికలు అయ్యేవరకు ఇలాంటి జోక్స్ తప్పదు మరి. విని సరదాగా నవ్వుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: