కేసీఆర్ మైకు తీసుకుంటే చాలు ప్రత్యర్థుల పై భూతులతో విరుచుకు పడుతాడు . అయితే కేసీఆర్ భాష మరీ శృతి మించుతుంది. తెలంగాణలో రెండోసారి అధికార పీఠమెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సమాజం.. తన జుగుప్సాకరమైన భాషకి 'పట్టం' కట్టారన్న భావనలో వున్నట్టున్నారు మరి.! ప్రెస్‌ మీట్‌ పెట్టి, కేసీఆర్‌ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తోంటే.. జర్నలిస్టులు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. 'ఇదేం ఖర్మరా బాబూ..' అని జర్నలిస్టులు సిగ్గు పడ్డారు. 

చంద్ర బాబు ను మరీ ఘోరంగా అవమానించిన కేసీఆర్ ... ఇవేమి తిట్లు స్వామీ ...!

తెలంగాణ ఎన్నికల సందర్భంలో చంద్రబాబుపై కేసీఆర్‌ విమర్శల్ని చూశాం. తెలంగాణ ఉద్యమంలోనూ రాజకీయ ప్రత్యర్థులపై హద్దులు దాటి విమర్శలు చేశారాయన. 'అది ఉద్యమం.. ఇప్పుడు రాజకీయం.. ఆ మాటలు ఇప్పుడు వుండవ్‌..' అని ఒకటీ అరా సందర్భాల్లో కేసీఆర్‌ చెప్పినా, ఆయన నాలిక మాత్రం.. ఆయన మాట వినే పరిస్థితి లేదు. సందర్భం దొరికితే, కేసీఆర్‌ తన బూతు పాండిత్యాన్ని ఉపయోగించేస్తుంటారు. ఇప్పుడూ అదే చేశారు. 


చంద్ర బాబు ను మరీ ఘోరంగా అవమానించిన కేసీఆర్ ... ఇవేమి తిట్లు స్వామీ ...!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు మాట మార్చిన మాట వాస్తవం. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, కాంగ్రెస్‌ని తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టి బీజేపీని తిడుతున్నారు. 'అంట కాగడం.. రాజకీయ వ్యభిచారం.. ఉసరవెల్లి రాజకీయాలు..' ఇలాంటి చాలా మాటల్ని చంద్రబాబుపై కేసీఆర్‌ ప్రయోగించి వుండొచ్చుగాక. కానీ, అలా మాట్లాడితే ఆయన కేసీఆర్‌ ఎందుకు అవుతారు.? 


మరింత సమాచారం తెలుసుకోండి: