ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పనిచేయడంలేదు. ఇది అందరి మాట. అధికార తెలుగుదేశం సైతం ఇదే అంటోంది. అంతేనా విపక్షంలోకి కాంగ్రెస్, వాపక్షాలు, అఖరుకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన కూడా ఇదే కామెంట్ చేస్తోంది. మరి ఇతర రాష్ట్రాల వారు ఏపీలో ప్రతిపక్షం పని తీరు మీద ఏమనుకుంటున్నారు.


ఏపీలో విపక్షం వీక్ :


ఆంధ్రప్రదేశ్లో విపక్షం మరీ వీక్ గా ఉందని పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీయార్ అంటున్నారు. అక్కడ సరిగ్గా ప్రతిపక్షం స్పందించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వం అడ్డగోలుగా పోతున్నా అడిగే నాధుడు లేకుండా పోయారని ఆయన ఆందోళన వ్యక్తం  చేశారు. ఏపీలో చంద్రబాబు అబద్దాల మీద అద్దాల మేడలు నిర్మిస్తూంటే కిక్కురుమనేందుకు కూడా ప్రతిపక్షం సిధ్ధంగా లేకపోవడం దారుణమని కేసీయార్ అంటున్నారు. ఇది నిజమేనిపిస్తోంది కూడా.


పాదయాత్రతో సరా:


వైసీపీ అధినేత జగన్ విధానాలు ఎవరికీ అంతుపట్టడంలేదు. ఆయన తన మానాన  తాను పాదయాత్ర చేసుకునిపోతున్నారు. దాదాపుగా 14 నెలల విలువైన కాలం ఆయన పాదయాత్రలో గడచిపోయింది.ఈ మధ్యలోఎన్నో వింతలూ విశేషాలూ ఏపీలో చోటు చేసుకున్నాయి. పాలన మరీ దారుణంగా గాడి తప్పింది. అడిగెందుకు అసెంబ్లీకి వైసీపీ వెళ్ళదు, జగన్ మీటింగుల్లో తప్ప ఎక్కడా ఏమీ మాట్లాడరు, ఆయన పార్టీ నాయకులు ఎవరూ కూడా దేని మీదా సరిగ్గా  స్పందించరు, కనీసం పోరాటాలు కూడా చేసే పరిస్థితుల్లో ఉండరు, మరి ఇదే అదనుగా ఏపీ సర్కార్ ఏం చెబితే అదే వేదమన్నట్లుగా పరిస్తితి ఉంది. అందువల్లనే కేసీయార్ సైతం అక్కడ ప్రతిపక్షమే లేదని ఘాటు మాట అనేశారు.


మెమే తగులుకుంటాం:


చంద్రబాబు పాలనలో అవినీతి విపరీతంగా  పెరిగిపోయిందని కేసీయార్ అన్నారు. నిత్యం అబద్దాలు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. ఓ వైపు శ్వేతపత్రాల్లో అభివ్రుధ్ధి చేశామంటున్న కేసీయార్ మరో వైపు పేద రాష్ట్రం అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో ఆయనే చెప్పాలంటూ కేసీయార్ సూటిగా నిలదీసిన విధానం ఏపీలో ఏ ప్రతిపక్షం ఇంతవరకూ చేయలేదు, మరి ఏపీకి ఇపుడు సరైన ప్రతిపక్షం కూడా కావాల్సివుందేమో



మరింత సమాచారం తెలుసుకోండి: