తెలంగాణా ముఖ్యమంత్రి, రాజకీయ గండర గండడు కేసీయార్ కి షాకులు ఇవ్వడమే తప్ప తగిలించుకోవడం అన్నది చరిత్రలోనే లేదు కదా. మరి అటువంటిది ఆయనకు కూడా షాక్ ఇచ్చారుట విశాఖ జనం. ఇది నమ్ముదామా. కేసీయార్ అంటేనే ప్రభంజనం, పదునైన వ్యూహాల రాజకీయ చాణక్యం. అటువంటి నాయకుడు సైతం ఖంగు తినే పరిస్తితి కలిగిందా...


షాక్ తిన్నానన్న కేసీయార్ :


తెలంగాణాకు రెండవమారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి పర్యటనలోనే విశాఖ వచ్చిన కేసీఆర్ కు విశాఖ వింత అనుభవం ఎదురైందట. తెలంగాణా  ఎన్నికల సమయంలో రాజశ్యామల హోమాన్ని నిర్వహించిన కేసీయార్ అధికారం చేపట్టాక అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పి అన్న మాట ప్రకారం విశాఖ వచ్చారు. ఆ సమయంలో వచ్చిన  జనం, కేసీయార్కు స్వాగతం చెప్పిన తీరుకు ఆయనే షాక్ తిన్నారట. ఇంత జనం వస్తారనుకోలేదు, ఎందుకిలా వెల్లువలా వచ్చి నా కోసం వేచి చూశారని కేసీయారే విస్తుబోయారట. విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పిన కేసీయర్ తన సందేహాన్ని విశాఖలోనే తీర్చుకున్నారట.


బాబు మీద కోపం :


తనకు స్వాగతం పలికిన వారికి తనపైన అభిమానం తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు మీద విపరీతమైఅన కోపం ఉందని అక్కడి వారి కేసీయార్ కి చెప్పారట. తెలంగాణా ఎన్నికల్లో బాగా బుద్ది చెప్పారని, అందుకే మొనగాడిగా వచ్చిన కేసీయార్ ని చూసేందుకు అంతమంది జనం వచ్చారట. ఇక ఏపీలోనూ చంద్రబాబు ఓటమికి కేసీయార్ నాంది పలికారన్న ఆనందంతోనేఅ జనం వచ్చారని చెప్పారట. దాన్ని విలెకరులకు చెబుతూ కేసీయార్ అక్కడ చంద్రబాబు పాలన మీద జనం విసిగిపోయి ఉన్నారని, అది తన పర్యటనలో స్పష్టంగా  కనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్లనే జనం అక్కడ అలా ఉండిపోతున్నారని కేసీయార్ అభిప్రాయపడ్డారు.


దారుణంగా ఓటమి :


విశాఖ పర్యటనలో కేసీయార్ ఏపీ రాజకీయాలను నిశితంగానే గమనించారట. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అక్కడ గెలవరు సరి కదా దారుణంగా ఓడిపోతారని కేసీయార్ చెబుతున్నారు. తాను చంద్రబాబును వదిలిపెట్టనని, ఇక్కడ నుంచే తగులుకుంటానని కేసీయార్ చెప్పుకొచ్చారు. తాను ముందే చెప్పినట్లుగా అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ బాబుకు తప్పకుండా ఇచ్చి తీరుతానని కూడా కేసీయార్ అంటున్నారు. మరి చూడాలి ఏపీ మీద కేసీయార్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో


మరింత సమాచారం తెలుసుకోండి: