తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ సీఎం ఆ పని చాలావరకూ పూర్తి చేశాడు. ఎన్నికల ముందు వరకూ టీడీపీ కాస్తో కూస్తో ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. మొన్నటి ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే... వారు కూడా పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు.



ఇప్పటికే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కారు ఎక్కేసేందుకు రెడీ అయ్యారు. ఆయనకు మంత్రిపదవి కూడా దక్కవచ్చని చెబుతున్నారు. ఆ వార్తలను సండ్ర ఏమాత్రం ఖండించే ప్రయత్నం చేయడం లేదంటే ఆయన చేరిక ఇక లాంఛనమే. సండ్ర ఇచ్చిన షాక్‌ తోనే ఇబ్బందిపడుతున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో షాక్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Image result for nama nageswara rao with chandrababu


రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదన్నట్టు వ్యవహరిస్తున్న కేసీఆర్ ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరరావును సైతం టీఆర్ఎస్‌ లోకి లాగుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే జిల్లా నుంచి ఓడిపోయిన మంత్రి ఆధ్వర్యంలో నామాను కారెక్కించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట.

Image result for nama nageswara rao with thummala


ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య చర్చలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను, నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్‌ లోకి తీసుకొస్తే ఆ మాజీ మంత్రికి ఓడిపోయినా మరోసారి మంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్నారట కేసీఆర్. ఇప్పటివరకూ ఎందరు నేతలు వెళ్లినా.. ఇప్పుడు నామా వెళ్లడం చంద్రబాబుకు పెద్ద దెబ్బే అవుతుందిమిగిలిన నేతలంతా పార్టీ పరంగా ముఖ్యులైతే.. నామా నాగేశ్వరరావు ఆర్థిక లావాదేవీల పరంగా ముఖ్యుడు. గతంలో తెలుగు దేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నామా నాగేశ్వరరావు చాలావరకూ ఆర్థికంగా ఆదుకున్నారని చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: