జగన్ పాదయాత్ర పూర్తి కావస్తోంది.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సి రావడంతో పెద్ద కసరత్తే చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ కూటముల లెక్కల్లో తేలుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఏ కూటమి వైపు వెళ్తారనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇంతకూ జగన్ యూపీఏ వైపా? ఎన్డీఏ వైపా? కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపా?

  Image result for jagan modi

ఏపీలో ప్రత్యేక హోదా అంశంపై మాట మార్చని నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్ మాత్రమే. చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై టర్న్ లు తీసుకున్నారు కానీ.. జగన్ మాత్రం హోదావైపే మొదటి నుంచి మొగ్గుచూపుతూ వస్తున్నారు. హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపుతారేమో అనే అమందేహం రాకమానదు. ఎందుకంటే.. హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ తేల్చి చెప్పేసింది. అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశం జగన్ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తారేమో అనే ఊహాగానాలను బలపరుస్తున్నాయి.

 Image result for jagan rahul

అయితే.. కాంగ్రెస్ కూటమి వైపు జగన్ వెళ్లడం కల్లే. ఎందుకంటే చంద్రబాబు ఆ కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలోకి పార్టీలన్నింటినీ లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్న ఆ కూటమిలోకి వెళ్లే ఆలోచన జగన్ పొరపాటున కూడా చేయరు. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి వెళ్తారనుకోవడమూ పొరపాటే. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని అన్ని పార్టీలూ గగ్గోలు పెడ్తున్నాయి. హోదా ఇచ్చేది లేదని బీజేపీ తెగేసి చెప్పేసింది. అంతేకాక.. బీజేపీకి జగన్ తొత్తులా మార్రాని అధికార టీడీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపై వైపు వెళ్తే అది మరింత నష్టం చేకూర్చడం ఖాయం. అందుకే ఆ కూటమిలే చేరడమూ ఇప్పట్లో సాధ్యం కాదు. ఎన్నికల తర్వాత  ఆలోచించవచ్చు.

 Image result for jagan kcr

ఇక మిగిలింది కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్. ఎన్నికల ముందు కేసీఆర్ కూటమిలో చేరే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో కేసీఆర్ ఓ పెద్ద విలన్. రాష్ట్ర విభజనకు కారణం కావడం, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో కేసీఆర్ అడ్డుపడ్తున్నారనే ఫీలింగ్ ఉండడం, మోదీతో తెరవెనుక స్నేహం చేస్తూ రాష్ట్రానికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నారనే ఆరోపణలు జగన్ ఫెడరల్ ఫ్రంట్ వైపు వెళ్లే సాహసం చేయనీయకపోవడానికి కారణం. అయితే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి, వైసీపీకి వచ్చే సీట్లను బట్టి జగన్ ఏ కూటమిలో చేరుతారనేది తేల్చనున్నాయి. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: