పిచ్చి పలురకాలు అని నిరూపించాడో వ్యక్తి. గాల్లో వెళ్తున్న విమానంలో ఉన్నట్టుండి బట్టలు విప్పేశాడు. ఎవరివో కాదు లెండి.. తనవే. దుబాయ్ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఈ సంఘటన జరిగింది.

man strips in aeroplane కోసం చిత్ర ఫలితం


అప్పటి వరకూ సాధారణంగానే ఉన్న ఆ ప్రయాణికుడు ఒక్కసారిగా విమానం మధ్యకు వచ్చి బట్టలు విప్పడం మొదలుపెట్టాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే ఒంటిపై నూలు పోగు లేకుండా అన్నీ విప్పేశాడు. అందరివైపూ చూస్తూ అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు.

man strips in aeroplane కోసం చిత్ర ఫలితం


అతగాడి విచిత్ర ప్రవర్తనతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విమానంలోని ఎయిర్‌ హోస్ట్రెస్ కూడా అతడ్ని చూసి ఏంచేయాలో తోచక బిత్తరపోయారు.

సంబంధిత చిత్రం


కొద్దిసేపటికి తేరుకున్న విమానం సిబ్బంది అతడిపై బలవంతంగా దుప్పటి కప్పేశారు. ఓ సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత విమానం లక్నోకి చేరుకోగాని అతడిని భద్రతాసిబ్బందికి అప్పగించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 150 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: