ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ విరుచుకుపడిన మరుసటిరోజే.. చంద్రబాబు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పద్ధతిగానే కేసీఆర్ విసిరిన అన్నింటికీ సమాధానాలిచ్చారు. ఎవరిది భాషో.. ఎవరికి భాష వచ్చో ప్రజలకు తెలుసన్నారు. రాజకీయ నాయకులు హుందాతనం కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు. చంద్రబాబు ఏమన్నారో పాయింట్ టు పాయింట్ చూద్దాం..

Image result for cbn vs kcr

  • కేసీఆర్ దారుణంగా పద్ధతి లేకుండా మాట్లాడారు
  • రాజకీయ నాయకులకుండే హుందాతనం కోల్పోయి మాట్లాడారు
  • నాగరిక ప్రపంచం అంగీకరించని చేయని భాష మాట్లాడారు
  • నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు
  • బానిసత్వానికి, ఊడిగం చేయడానికి కూడా హద్దులుంటాయి
  • పద్దతిలేని రాజకీయాలు నేనెప్పుడూ చేయలేదు
  • నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ పద్దతిగానే ఉన్నాను
  • కేసీఆర్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?
  • మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది టీడీపీ కాదా..?
  • నువ్వు నా దగ్గర పనిచేయలేదా..?
  • నేను 44 సీట్లు ఇస్తే పది సీట్లు గెలిచావు
  • తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెసులో కలుపుతానని చెప్పావు..?
  • ఇక్కడికి వచ్చి వైసీపీ, మోడీతో కలిసి పొత్తు పెట్టుకో
  • ఇక్కడ ఎవరూ అడ్డం లేరు.. మీరు ముగ్గురూ కలిసి పోటీ చేయండి
  • మోదీ నమ్మించి మోసం చేశారు కాబట్టే కేంద్రం నుంచి బయటకు వచ్చాం
  • దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్ని పార్టీలను కలిశాను
  • పూజలు చేసుకోవడంలో తప్పు లేదు.. జనం చూడటానికి వస్తే నన్ను గెలవనీయమని చెప్పడమేంటి..?
  • 1995లో కూడా శ్వేత పత్రాలు విడుదల చేసాను.. అప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు
  • అప్పుడు బాగా పొగిడి ఇప్పుడు తిట్టడంలో అర్థం ఏంటి..?
  • హైకోర్టు విషయంలో నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్రం కాదా..?
  • హైకోర్టు విషయంలో కొంచెం సమయం కావాలని మాత్రమే అడుగుతున్నాం
  • హరికృష్ణ మరణం సమయంలో నేను చేసిన తప్పేంటి..?
  • నేను అవకాశవాద రాజకీయాలు చేయడం ఏంటి..?
  • విభజన తర్వాత రాష్టానికి న్యాయం చేయాలా..? వద్దా..?
  • కేంద్రం నుంచి డబ్బులు ఏం తీసుకున్నాం?
  • ఫైనాన్స్ కమిషన్ అందరితో పాటే మాకు నిధులిచ్చింది. అవి ప్రత్యేకంగా ఇచ్చినవి కాదు
  • ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరపాలని, న్యాయం చేయాలని మొదట నుంచి కోరాను
  • ఏపీకి హోదాపై లేఖ రాస్తామన్నారు కదా.. రాయండి..
  • మీ ఇంటికోసం 300 కోట్లు కావాలి.. కానీ సెక్రటేరియేట్ కి మాత్రం వద్దు
  • ఉమ్మడి రాజధానిలో మాకున్న మౌలిక వసతులు కూడా మీకు కేటాయిస్తే మీరు కనీసం సచివాలయానికి కూడా వెళ్లరు
  • సచివాలయానికి వేసిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ ను కూడా చులకన చేసి కించపరిచేలా మాట్లాడుతున్నారు
  • తెలంగాణ కార్యక్రమాలు అన్నీ మనం కాపీ కొడుతున్నాం అంటున్నారు
  • నాలుగేళ్లలో తెలంగాణలో వ్యవసాయంలో సాధించిన సగటు వృద్ధి 0.2% ఉంటే ఏపీలో 11% వృద్ధిని సాధించాం
  • సాగునీటి ప్రాజెక్టులకోసం తెలంగాణలో లక్ష కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు... మరి ఎక్కడా ప్రాజెక్టులు కనిపించడం లేదే?
  • 1995-2004 మధ్య హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాను, ఇప్పుడు తెలంగాణకు హైదరాబాదే ప్రధాన ఆదాయవనరుగా ఉంది.
  • నాడు ఏపీకి 500 కోట్లు ఇస్తామన్న కేసీఆర్, ఇప్పుడు కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది చాలదా అంటున్నారు
  • మిగులు బడ్జెట్, అధిక ఆదాయం ఉన్నా తెలంగాణ వృద్ధి తక్కువుగా ఉంది
  • లోటు బడ్జెట్, అత్యల్ప ఆదాయం ఉన్నా ఏపీ ఎక్కువ వృద్ధి సాధిస్తోంది
  • తెలంగాణ విషయంలో నేనెప్పుడూ విభేదించలేదు
  • జై తెలంగాణ అని మీరు నాతో అనిపించిందేంటి?
  • నాకు భాష రాదంటున్నావు.. నీకు ఏం వచ్చు? ఏం మాట్లాడుతున్నావు..?
  • నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించాను, ఆయన రాష్ట్రానికి రావడం మానేశారు
  • మోదీ పేరు చెప్పి కేసీఆర్ ఇప్పుడు తిడుతున్నారు
  • బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం పద్ధతి కాదు
  • నువ్వొక కేసు పెడితే, నేను నాలుగు కేసులు పెడతాను
  • మోదీ కోసం కేసీఆర్, జగన్ అందరూ కలిసి పనిచేస్తున్నారనేది సామాన్యుడి స్పందన
  • బంగారు గుడ్లు పెట్టే తెలంగాణను వదిలివచ్చినా కేసీఆర్‌కు నాపై అక్కసు
  • తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టని కేసీఆర్, దేశాభివృద్ధి పట్టని మోదీ ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి కానివ్వకుండా చూస్తున్నారు
  • శంషాబాద్ కన్నా అద్భుతమైన విమానాశ్రయాన్ని అమరావతిలో నిర్మిస్తా!
  • రాజధాని శంకుస్థాపన రోజు నరేంద్ర మోదీ మట్టి, నీరు మన మొహాన కొట్టిపోయారు
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను భరించలేకపోతున్నారు అనడంలో అర్థం లేదు
  • ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు నుంచి కేసీఆర్‌ను మోదీ తప్పించారు
  • కేసులు చూపించి బెదిరించడం అలవాటుగా మారింది
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొదట చెప్పిన  కేసీఆర్, కవిత.. కేంద్రంపై ఇదే అంశంపై అవిశ్వాసం పెడితే మాత్రం మనకు మద్దతివ్వలేదు..
  • ఎవరికీ హోదా ఇవ్వమని చెప్పిన కేంద్రం ఆ తర్వాత మనకు తప్ప 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చింది, అందుకే కేంద్రంతో విభేదించాను..
  • మోదీని గాడు, సన్నాసి అన్న కేసీఆర్.. ఇప్పుడిద్దరూ మళ్లీ కౌగిలించుకున్నారు..
  • నేను మోదీని వ్యతిరేకిస్తున్నాను కాబట్టే, కేసీఆర్‌ను మోదీ దువ్వుతున్నారు.. దానికి కేసీఆర్‌కు ఆనందంగా ఉంది..
  • కేసీఆర్ మిడిల్ మోడీ.. జగన్ జూనియర్ మోడీ
  • నాడు పదవి ఇవ్వలేదు కాబట్టే, కేసీఆర్‌ టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు...
  • నిప్పులా బతికాను, నన్నేమీ చేయలేరు
  • మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వద్దన్నందుకే కేసీఆర్ టీడీపీతో పొత్తుకు ముందుకు రాలేదు
  • నేను కేసు పెట్టాలంటే ఫోన్ ట్యాపింగ్ లాంటివి చాలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: