ఏపి సిఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు లీడర్ కాదని మేనేజర్ మాత్రమే అంటూ విమర్శించారు. ప్రగతిభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు ఘోరాతి ఘోరం గా ఓడిపోతారన్నారు. తాను ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ చాలా అద్భుతంగా ఉంటుందని అది చంద్రబాబు దారుణ ఓటమే నని ద్వనించింది. ఫెడరల్-ఫ్రంట్ కోసం తాను చేస్తున్న పోరాటం, దాని లక్ష్యం అయిన ఆర్ధిక నమూనా  చంద్రబాబు లాంటి చిల్లర గాళ్లకు ఏమాత్రం అర్థం కాదని విమర్శించారు.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం

తాను ప్రారంభించింది మహాయజ్ఞమని చంద్రబాబులా నేను హడావుడి చేయనని తాను అనుకున్నవిధంగా జరగాలంటే కొంత సమయం పడుతుంది కానీ ఆ లక్ష్య సాధన జరిగి తీరుతుందని పునరుద్ఘాటించారు. దేశ ప్రజలకు మంచి జరగాలనేదే తన తపన అన్నారు.


ఓటుకు నోటు కేసు దెబ్బతో చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొదటిసారిగా పైచేయి సాధించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య అవగాహన కుదిరినట్టు కనిపించి నా, అది పైపైకే అని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఇద్దరు చంద్రుల మధ్య వైరం మరింత ముదిరింది. తెలంగాణ లో తనను ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోయారు. తనలోని కోపాన్ని దాచుకొని, ఎన్నికల ఫలితాల తర్వాత విలేకరు లతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నిక లలో తాను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ హెచ్చరించారు.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు రాజకీయప్రత్యర్థి జగన్మోహన్‌రెడ్డికి తమ మద్దతు ఉంటుందని కేసీఆర్‌ బాహాటంగానే ప్రకటించారు. ఎన్నికలలో భారీవిజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చంద్రబాబుతో పోటీ పడటానికి పావులు కదపడం మొదలెట్టారు. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలలో పరోక్షంగా జోక్యం చేసుకోవడం ద్వారా చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్‌ ప్రయత్నించకుండా ఉండరు.


ఏపీలో చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే జాతీయ రాజకీయాలలో కూడా తనదే పైచేయి అవుతుంద న్నది కేసీఆర్‌ అభిప్రాయంగా చెబుతున్నారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలలో మజ్లిస్‌ కు ఒకటి పోగా మిగతా 16 స్థానాలను సొంతం చేసుకోవడంపై కేసీఆర్‌ దృష్టి పెట్టారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి 15 లోక్‌సభ స్థానాలై నా గెలుచుకోగలిగితే ఇరువురికీ కలిపి 30 మందికి పైగా ఎంపీల బలం ఉంటుంది కనుక సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఈ 30 మంది మద్దతు కీలకం అవుతుందన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం

చంద్రబాబును ప్రత్యర్థిగా పరిగణిస్తున్న కేసీఆర్‌, జగన్ ని మిత్రుడిగా ప్రకటించడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఈ ఆలోచనతో పాటు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ను ప్రతిపాదించడం వెనుక మరో కారణం కూడా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 


1989 కి ముందు నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ తాను చైర్మన్‌ గా, విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ కన్వీనర్‌గా నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేశారు. 1989 లో జరిగిన ఎన్నికలలో నేషనల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నేషనల్‌ ఫ్రంట్‌ లో కీలక పాత్ర పోషించిన ఎన్‌టీఆర్‌ ఏపీ లో మాత్రం ఓడిపోయారు. తెలుగు దేశం తరఫున ఇద్దరే ఎంపీలు గెలిచారు. దీంతో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లో తెలుగుదేశం పార్టీ పాత్ర నామమాత్ర మైంది. ఆదే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పునః ప్రాప్తి అవుతున్న పరిస్థితులు  నెలకొంటున్నాయి.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం

నాడు టిడిపి కోరినప్పటికీ నాటి ప్రధాని వి.పి.సింగ్‌ ఖాతరు చేయలేదు. ఓడిపోయిన వారికి ఉప ప్రధాని పదవి ఎలా ఇస్తామంటూ తిరస్కరించారు. రాజకీయాలలో అను బంధాలకు తావు ఉండదు అనడానికి ఇదొక ఉదాహరణ!  నాడు ఎన్‌టీఆర్‌ ఎదుర్కొన్న పరిస్థితినే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కల్పించగలిగితే జాతీయ రాజకీయాలలో తనకు అడ్డు ఉండదన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలలో లభించిన విజయంతో కేసీఆర్‌ బలం పెరిగింది.


లోక్‌సభ ఎన్నికలలో ఆయన కోరుకుంటున్నట్టుగా 16స్థానాలను గెలుచుకునే అవకాశం లేక పోలేదు. ఏ కారణం వల్లనైనా ముస్లింలు దూరమైతే ఈలెక్కల్లో తేడా రావచ్చు కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు పరిస్థితి పూర్తిగా భిన్నం. ముందుగా ఏపి శాసనసభలో గెలిచి తన బలం నిరూపించుకోవాలి.  25 లోక్‌సభ స్థానాలకుగానూ మెజారిటీ స్థానాలను గెలుచుకోవలసి ఉంటుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బలహీనంగా ఉండటం, నాయకత్వలేమి కారణంగా కేసీఆర్‌ విజయం సులువు అయింది. ఏపీలో ఇటువంటి వెసులుబాటు చంద్రబాబుకు లేదు.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం

అంతేకాదు అధికార పార్టీ కులానికే అగ్రతాంబూలం ఉండటం - ఆ కులానికే చెందిన ప్రధాన మీడియా ప్రవర్తన ముఖ్యమంత్రి తానే అంటే ఆ మీడియా తందానా అనటం - ఇదంతా ప్రజలకు ముఖ్యమంత్రికి మద్య ఒక ఇనుప తెర గా మారటం - ఆ కుల చిలుక ఆ గూటిపలుకే పలకటంలో ఏపిలో ఉదృతంగా కులస్వామ్యం ప్రభలి పోయింది. కొన్ని సార్లు సిఎం చేయాల్సిన రాజకీయ వ్యూహం మీడియా చేసేస్తూ ఉండటం ప్రజల్లో ఆ మీడియాపై ఉన్న వ్యతిరేఖత కూడా కలగలసి చంద్ర బాబును చావుదెబ్బ కొట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక్కడ రాజకీయాలు భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు, కులజనులు అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు రాజకీయాల చుట్టూతిరగటం తో ఇక్కడ రాజకీయాలంటే అధికార పార్టీ కులానికేనని జానాలకు అర్ధమవటం జరిగింది.


కెసీఆర్, మోడీ, జగన్, పవన్, ఓట్ ఫర్ నోట్,  తెదెపా నాయకుల అవినీతి పన్నుఎగవేత కేసులు, చంద్రబాబు అనేక సందర్భాల్లో ఆడిన అబద్ధాలు, ప్రతిపక్ష ఎమెల్యెల ను తనపార్టీలోకి లాక్కున్న అన్యాయం, తన ఎమెల్యేలు మంత్రులు మహిళలపై చేసిన లైంగిక అకృత్యాలు, తెలుగుదేశం మద్దతు మీడియా చేస్తున్న విపరీత ప్రచారం ప్రజలకు వెగటు కలిగించటం, ప్రతి చోటా అధినేత కులాధిపత్యం, ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాప్రయత్నం సమయంలో డిజిపి, సిఎం, టిడిపి నాయకులు, మంత్రులు మూకుమ్మడిగా ప్రదర్శించిన దుర్మార్గపు వైఖరి ఇవన్నీ కలసి ఒక్కసారే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటమి నిశ్చయం చేసేశాయి -దేశంలో నాడు నేషనల్ ఫ్రంట్ లో ఎన్టీఆర్ కు పట్టిన గతే రేపు చంద్రబాబు కు పట్టబోతోంది అంటున్నారు కేసీఆర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో.

kcr vs chandrababu naidu కోసం చిత్ర ఫలితం 

అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ అనే ఒక మహా యజ్ఞం ప్రారంభించాను. నేను చేస్తున్న కృషి చంద్రబాబు లాంటి నాయకులకు అర్థంకాదు. నేనేం గత్తర బిత్తర చేయడం లేదు. అందరినీ ఒప్పిస్తున్నా. సమైక్యాంధ్ర అని కూర్చున్న చంద్రబాబు తో జై తెలంగాణ అనిపించలేదా? అలాగే టైం పడుతుంది. ఎన్నికల ముందు నాటికి ఆర్థిక నమూనా ప్రకటిస్తాం. ఆ తర్వాత వివరాలిస్తాం. కేంద్రం దగ్గర దాదాపు ₹ 20 లక్షల కోట్లున్నాయి. వీటిని సక్రమంగా వినియోగించడం లేదు. ఇది దేశానికి మంచిది కాదు. కూటమిలోకి ఎవరైనా రావచ్చు. చంద్రబాబు కూడా వస్తారు. కానీ ఇలాంటి వాళ్లను తీసుకుంటామా? మాకు సిద్ధాంతం, పద్ధతి ఉన్నాయి. దేశ ప్రజలకు లాభం చేయాలన్న ఆలోచన ఉంది. ఇంకా ఫెడరల్‌ ఫ్రంట్‌, ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలకు చెప్పలేదు. రాజకీయ ఒత్తిడి పెంచుతాం. రైతుబంధుపై సీఎస్‌కు వంద ఫోన్లు వచ్చాయి. మనం చేసిన పథకంతో దేశ రైతులకు లాభం జరుగుతోంది కేంద్రం కూడా త్వరలో ప్రకటించ బోతోంది. ఇలా కేసీఆర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంటే చంద్రబాబు సర్వం కోల్పోతున్న నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: