కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగ్ ల్లో ఓడిపోవటం నిజంగా అతనికి షాకింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికి ఆ భాద నుంచి కోలుకోలేదని తెలుస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కాబోలు తాజాగా మధ్యప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని పెంచ్ పులుల అభయారణ్యంలో రేవంత్ రెడ్డి బ్లాక్ జాకెట్ వేసుకొని పర్యటిస్తున్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి.

Image result for revanth reddy

రేవంత్ రెడ్డి తన ఓటమిని జీర్ణించుకోలేక  బాధపడుతున్నట్టు ఆ ఫొటోల్లో స్పష్టంగా కనపడుతోంది. కానీ కాంగ్రెస్ కేడర్ మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని.. వెంటనే తేరుకొని రేవంత్ క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఎదురుచూస్తున్నారు. రేవంత్ తోపాటు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ సారి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.


ఎవరికి వారే అన్న చందంగా మీడియా ముందుకు రావడం లేదు. నాలుగు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎంత త్వరగా శక్తి పుంజుకొని మళ్లీ పునురుత్తేజం అయ్యి కార్యక్షేత్రంలోకి దిగాలి. కాంగ్రెస్ నేతలు ఇలానే ఉదాసీనంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్నట్టు 16 పార్లమెంట్ స్థానాల్లో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: