మొత్తానికి వైఎస్ జగన్ తలపెట్టిన పాదయాత్ర అప్రతిహతంగా సాగుతూ చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో పాదయాత్ర ఘనంగా ముగియబోతోంది. దాదాపుగా పద్నాలుగు నెలలు, 3,500 కిలోమీటర్లకు పైగా  సుదీర్ఘమైన నడక, వర్తమాన కాలంలో మరేవరూ చేదించలేని, సాధించలేని రికార్డుని జగన్ సొంతం చేసుకున్నారు.


శ్రీవారి సేవలో :


కొత్త ఏడాది జనవరి 9న  జగన్ పాదయాత్ర ఇచ్చాపురం వేదికగా ముగియనుంది. జగన్ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయానికి గురుతుగా భారీ పైలాన్  ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా జగన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుభవాలను పంచుకుంటారు. ఈ మొత్తం కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్లతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు చెందిన ఇంచార్జులు కూడా హాజరవుతారు. పాదయాత్ర ముగిసిన మరుసటి రోజున జగన్ తిరుమల వెళ్తారని పార్టీ వర్గాలు తెలియచేశాయి.
ఇచ్చాపురం నుంచి నేరుగా తిరుపతి వెళ్ళి శ్రీవారి సేవలో జాగన్ పూజలు చేస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్ ఈ విధంగానే తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఘనంగా ముగిసినందుకు జగన్ మళ్ళీ ఆ దేవదేవున్ని మొత్తం కాలి నడకన మెట్ల దారిన దర్శించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


జెరూసలెం కూడా :


ఇక జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత జెరూసలెం కూడా వెళ్తారని అంటున్నారు. అక్కడ జీసస్ ని దర్శించుకుని వస్తారని చెబుతున్నారు. ఆ మీదట కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి బస్సు యాత్రతో జనం ముందుకు వస్తారని పార్టీ వర్గాల సమాచారం. జగన్ పాదయాత్ర ద్వారా 140 అసెంబ్లీ సీట్లలో ప్రచారం చేశారు. మిగిలిన 35 సీట్లను బస్సు యాత్ర ద్వారా కవర్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేడిని రగిల్చేందుకు జగన్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: