చూడబోతే అలాగే ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు బాగా వేడెక్కిపోతున్నాయి. అందులోను తెలంగాణా సిఎం కెసియార్  కూడా వేడికి బాగానే ఆజ్యం పోస్తున్నారు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబునాయుడు కోసం కెసియార్ పెద్ద ట్రాప్ వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కెసియార్ మాట్లాడుతూ ఎన్టీయార్ నుండి చంద్రబాబు తెలుగుదేశంపార్టీని లాక్కున్నట్లు మండిపడ్డారు. దానికి స్పందించిన చంద్రబాబు అనాలోచితంగా ఓ మాటన్నారు. ఎన్టీయార్ నుండి తాను టిడిపిని లాక్కున్నపుడు కెసియార్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. అంటే ఎన్టీయార్ నుండి తాను తెలుగుదేశంపార్టీని లాక్కున్నట్లు బహిరంగంగా అంగీకరించినట్లే కదా ?

 Image result for ntr viceroy hotel episode

ఇక్కడే అందరిలోను కెసియార్ వ్యూహం స్పష్టమవుతోంది. ఎందుకంటే 1995లో ఎన్టీయార్ నుండి చంద్రబాబు పార్టీని లాక్కున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడూ అంగీకరించలేదు. అదే సమయంలో ఎన్టీయార్ నుండి టిడిపిని లాక్కోవటం చద్రబాబు వల్ల కాదు. అందుకనే పార్టీలో చాలామంది నేతలను కలుపుకున్నారు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటంటే ఎన్టీయార్ కుటుంబం యావత్తును తనకు అండగా పెట్టకున్నారు. అంటే ఎన్టీయార్ కుంటుంబం అండతో, పార్టీ నేతల మద్దతుతోనే చంద్రబాబు కుట్ర చేసి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచారన్నది బహిరంగ రహస్యం. ఆ సమయంలో కెసియార్ కూడా చంద్రబాబుతోనే ఉన్నారు.

 Image result for ntr viceroy hotel episode

వాస్తవాలిలా ఉండగా చంద్రబాబు మాత్రం ఎన్నడూ నోరిప్పలేదు. అలాంటిది పార్టీని లాక్కునే విషయంలో చంద్రబాబును ఉద్దేశించి కెసియార్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు అనాలోచితంగానే చంద్రబాబు నోరుజారారు. ఎన్టీయార్ నుండి తాను పార్టీని లాక్కున్నపుడు కెసియార్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా పార్టీని లాక్కున్నపుడు వైశ్రాయ్ హోటల్ వేదికగా జరిగిన వ్యవహారాలకు కెసియారే కదా కీలక పాత్ర అంటూ గుట్టువిప్పారు. దాంతో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంపార్టీని లాక్కున్న విషయాన్ని ఇంతకాలానికి చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: