తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. సాధారణ మెజారిటీ కన్నా చాలా ఎక్కువ స్థానాలు కేసీఆర్ గెలుచుకున్నారు. అంతే కాదు.. ఇప్పటికే ఇండిపెండెంట్లు కొందరు టీఆర్‌ఎస్‌ లో చేరిపోయారుమరికొందరు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తల ఊపితే వచ్చి టీఆర్ఎస్‌ లో చేరిపోయేలా ఉన్నారు.



మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారుకు మరో ఐదేళ్ల వరకూ ఎలాంటి ఢోకాలేదు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఇంతవరకూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. సంక్రాంతి తర్వాత కేబినెట్ పూర్తిస్థాయిలో ఏర్పడవచ్చు. కానీ ఆ లోపే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందట.

vemuri anand surya కోసం చిత్ర ఫలితం


ఈ మాటలంటున్నది టీడీపీనేత, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్‌ సూర్య అంటున్నారు. ఓ టీవీ చానెల్ డిస్కషన్లో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరి ఆయన యథాలాపంగా అన్నారా.. లేక ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా మర్మం ఉందా అన్నది మాత్రం తెలియడం లేదు.

vemuri anand surya కోసం చిత్ర ఫలితం


టీఆర్‌ఎస్ సర్కారు ఉన్నపళంగా కూలిపోవాలంటే ఆ పార్టీలో పెద్ద అంతర్గత సంక్షోభమే రావాలి. పార్టీ నిట్టనిలువునా చీలిపోవాలి. కానీ ఇప్పట్లో అలాంటి సంకేతాలేమీ లేవు. టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం టీడీపీ ఎంతటి కుట్రలకైనా తెగపడవచ్చని.. ఎందుకైనా జాగ్రత్తగా ఉండాలని తమలో తాము చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: