రాజ‌కీయాల్లో ఓ సూత్రం ఉంది. శాశ్వ‌త మిత్రులు కానీ, శాశ్వ‌త శ‌త్రువులు కానీ ఉండ‌ర‌నేది రాజ‌కీయ ప్రాధ‌మిక సూ త్రం. ఎన్ని తిట్టుకున్నా.. ఎన్ని మాట‌లు  అనుకున్నా.. నేత‌లు త‌మ త‌మ అవ‌స‌రం కోసం క‌లిసి పోవ‌డం రాజ‌కీయాల్లో వెన్న‌తో పెట్టిన విద్య‌లా అబ్బేస్తుంది.  అయితే, దీనికి భిన్నంగా ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అధినేత మ‌ధ్య సాగుతున్న రాజ‌కీయ వైరం మాత్రం ఇప్ప‌టితో ముగియ‌క‌పోగా. మ‌రింత బ‌ల‌ప‌డుతుండడం రాజ‌కీయాల్లో సీనియ‌ర్ల‌ను కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది. నిజానికి రాష్ట్ర రాజ‌ధానిగా హైద‌రాబాద్ ప‌దేళ్ల‌పాటు ఏపీకి వినియోగంలో ఉంది. అయినా కూడా చంద్ర‌బాబు హ‌డావుడిగా ప‌రిగెత్తుకుని వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు ఉన్న‌ది లేదు. 


ఇక‌, అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు కూడా అటు తెలంగాణా సార‌థి కేసీఆర్ కు ఏపీ సార‌థి చంద్ర‌బాబుకు కూడా ప‌రిస్థితు లు ఎడ‌మొహం పెడ‌మొహంగానే ఉన్నాయి. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సార్లు .. ఉమ్మడి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఇద్ద‌రు చంద్రుల‌ను క‌లిపేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా.. అవి పైపై ముచ్చ‌ట‌కే ప‌రిమిత‌మ‌య్యాయి త‌ప్ప‌.. సుదీర్ఘ ప్ర‌స్థానంలో ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విభేదాల‌ను మాత్రం తోసిపుచ్చ‌లేక పోయాయి. ఈ క్ర‌మంలోనే త‌న‌కు అంది వ‌చ్చిన అవ‌కాశం అనుకుని, కేసీఆర్‌ను అణిచేసేందుకు ద‌క్కిన అవ‌కాశం గా భావించిన చంద్ర‌బాబు తెలంగాణా ఎన్నిక‌ల్లో లేని బ‌లాన్ని ఊహించుకున్నారు. 


ఏకంగా కేసీఆర్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని ఆయ‌న పిలుపు నివ్వ‌డం, బ‌ద్ధ వైరిప‌క్షం కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌ప‌డం వంటి ప‌రిణామాలు సాధార‌ణంగానే కేసీఆర్‌ను ఆయ‌న నేత‌ల‌ను కూడా తీవ్ర‌స్థాయిలో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఎన్నిక లు ముగిసే వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించిన కేసీఆర్ ఆ త‌ర్వాత బాబు అంతుచూడ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతు న్నారు. బాబును ఒక విధంగానే కాకుండా రెండు విధాలుగా కూడా నాశ‌నం చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఒక‌టి ఏపీలో ఆయ‌న‌ను ఓడించేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకోవడం, రెండు కేంద్ర రాజ‌కీయాల్లోనూ బాబు హ‌వాను త‌గ్గించ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ కేసీఆర్ స‌క్సెస్ కావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఒక వేళ ఈ రెండు విష‌యాల్లోనూ కేసీఆర్ విఫ‌ల‌మై.. మ‌ళ్లీ బాబే రాజ‌కీయంగా వెలిగిపోతే.. ఏపీకి తీవ్ర‌మైన నష్టాలు త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో వీరి వైరం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: