ప్రతి ఏడాది మనం మిస్ కాకూడని ఈవెంట్స్, సెలబ్రేషన్స్ ఉంటుంటాయి. ముందుగానే వాటి గురించి తెలుసుకుంటే.. ఏదీ మిస్ కాకుండా ఎంజాయ్ చేయొచ్చు. మరి కొత్త సంవత్సరం 2019లో మనం మిస్ కాకుడని ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందామా.. 

new year 2019 కోసం చిత్ర ఫలితం

జనవరి రెండో వారంలో గుజరాత్ లోన అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి చిత్రవిచిత్రమైన పతంగులను ఇక్కడ ఎగరేస్తారు. భలే విచిత్రంగా ఉంటుంది.

సంబంధిత చిత్రం

ఇక జనవరి 15 నుంచి మార్చి 4 వరకూ ప్రయాగలో అర్థ మహా కుంభమేళా జరుగుతుంది. ప్రపంచంలోనే ఒకే దగ్గర ఇంతమంది జనం పోగుపడటం ఓ రికార్డు. 192 దేశాల నుంచి భక్తులు ఈ కుంభమేళాకు వచ్చే అవకాశం ఉంది.

Image result for kumbh mela

జూలై 4న ఒడిశాలోని పూరీ జగన్నాధుడి రథయాత్ర జరుగుతుంది. దేవేరులతో రథయాత్రలో పాల్గొన్న జగన్నాథుని చూసి తరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారు.

puri jagannath rath yatra కోసం చిత్ర ఫలితం

ఆగస్టు 10న కేరళలో వైభవంగా అలెప్పీ బోట్ రేస్ జరుగుతుంది. దాదాపు 100 అడుగుల పొడవుండే పడవలతో వంద మందికిపైగా తెడ్డు వేస్తుంటే జలంలో పరుగులు తీసే పడవల సొగసు చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

సంబంధిత చిత్రం

నవంబర్ మొదటి వారంలో రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ప్రతి ఏటా క్యామెల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒంటెలను అలంకరించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. వేల సంఖ్యలో ముస్తాబైన ఒంటెలు కనువిందు చేస్తాయి.

Image result for camel mela


మరింత సమాచారం తెలుసుకోండి: