తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్‌.. గతంలో టీడీపీలో ఉన్నా.. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినా ఆయన తరచూ మాటల తూటాలు పేలుస్తుంటారు. ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలిపై లేస్తుంటారు. ఇంత ఘాటుగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టిన వారు వేరెవరూ లేరేమో...

Image result for revanth reddy

అలాంటి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత సైలంటైపోయారు. పార్టీతో పాటూ తానూ ఘోరంగా ఓడిపోవడంతో నోటి జోరు తగ్గించారు. అంతే కాదు.. ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటి నుంచి మరో రెండేళ్లపాటు ఆయన మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారట.


Image result for revanth reddy

ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన గోల్కొండ హోటల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశానికి వచ్చిన సమయంలో ఈ విషయం వెల్లడించారు. మీడియా ఆయన్ను పలకరించినా మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పుడే తాను మరో రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించినట్టు చెప్పారు.

revanth reddy కోసం చిత్ర ఫలితం


ఇన్నాళ్లు మీ కోసం, ఇకపై నాకోసం మాట్లాడటం మానేస్తున్నానని రేవంత్ చెప్పడం విశేషం. ఒక విధంగా రాజకీయ నాయకుడికి నోరే ఆయుధం.. ప్రెస్‌మీట్ల ద్వారానే పబ్లిసిటీ, ఉనికి ఉంటాయి. మరి రెండేళ్లపాటు రేవంత్ రెడ్డి మాట్లాడకుండా ఉంటే.. ఆయన రాజకీయాల్లో ఎలా కొనసాగుతారో.. లేక.. మొదటి రెండేళ్లు సైలంట్‌ గా ఉండి.. చివరి మూడేళ్లు వయెలెంట్‌గా మారాలని నిర్ణయించుకున్నారేమో రేవంత్‌ రెడ్డి. చూద్దాం ఈ మౌవం.. ఎన్నాళ్లో..?


మరింత సమాచారం తెలుసుకోండి: