కొత్తగా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజవాది పార్టీ నుండి ముసలం ముంచుకొని వచ్చినట్లుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు, ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యా బలం లేని సమయంలో మద్దతు ప్రకటించిన విషయంలో ఇప్పుడు బీఎస్పీ అల్టిమేటం ఇచ్చింది. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుపై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా 2018 ఏప్రిల్ 2 తేదీన చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ లో నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
rajasthan assembly final tally కోసం చిత్ర ఫలితం

లేని పక్షంలో ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలకు తాము బయటి నుంచి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఎస్టీ-ఎస్టీ అట్రాసిటీ పై సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ పలువిపక్షాలు, దళిత సంఘాలు ఏప్రిల్ 2న భారత్ బంద్ పాటించిన సందర్భంగా చోటు చేసుకున్న వివిధ హింసాత్మక సంఘటనలు నాటి ఆందోళన కార్యక్రమాల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా 10 మంది మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు నమోదు చేశారు.
rajasthan assembly final tally కోసం చిత్ర ఫలితం
ఈ కేసులను ఎత్తివేయాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు బీఎస్పీ అల్టిమేటం విధించడం, కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి రెండు వారాలు గడవక ముందే మాయావతి మద్దతు ఉపసంహరణపై హెచ్చరికలు చేయడం రాజకీయవర్గాల్లో హాట్-టాపిక్‌ గా మారింది.  మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు సీట్ల దూరంలో నిలవగా, బీఎస్పీ మద్దతు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆనాడు ప్రకటించారు.

MP Rajasthan CMs కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: