కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోవడం తో షాక్ కు గురైయ్యాడు అని చెప్పక తప్పదు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి బంపర్‌ మెజార్టీతో విక్టరీ కొడతాననీ, అదృష్టం కలిసివస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాననీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కానీ, కొడంగల్‌ నుంచి గెలవేలక చతికలపడ్డారు రేవంత్‌ రెడ్డి. అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కొడంగల్‌లో గులాబీ జెండా ఎగురవేయగలిగారు.

Image result for revanth reddy

ఊహించని ఈ దెబ్బతో విలవిల్లాడిన రేవంత్‌ రెడ్డి, రెండేళ్ళపాటు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారట. అసలు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డిని చేర్చుకున్నదే ఆయన 'నోరు' చూసి. నిజమే మరి, ఆయన వాగ్ధాటి అలాంటిది. కేసీఆర్‌కి ధీటైన నాయకుడు.. అని టీడీపీ గతంలో భావించినా, నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్‌ నమ్మినా.. అదంతా రేవంత్‌ రెడ్డి వాక్చాతుర్యం కారణంగానే. కానీ, ఆ 'మాట తీరే' ఆయన్ని రాజకీయంగా ఇప్పుడు అత్యంత పతనావస్థకు దిగజార్చేసింది.

ఓవరాక్షన్‌.. రేవంత్‌ రెడ్డి నోటికి తాళం.!

రేవంత్‌ రెడ్డి రెండేళ్ళు మీడియాతో మాట్లాడకపోతే, కాంగ్రెస్‌ పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి మాత్రం ఎందుకు వుంటుంది.? మాట్లాడేవారికే కదా.. పదవి అనేది.! అంటే, పదవి పోతుందని తెలిసే రేవంత్‌ రెడ్డి జాగ్రత్త పడినట్టున్నారని అనుకోవాలేమో. రెండేళ్ళు అంటే చిన్న విషయమేమీకాదు. రాజకీయంగా యాక్టివ్‌గా వుండకపోతే, ఓటుకు నోటు కేసు కావొచ్చు.. మరో సమస్య కావొచ్చు.. రేవంత్‌ని మరింతగా ఇబ్బందులకు గురిచేయడం ఖాయం. అప్పుడాయనకు కాంగ్రెస్‌ మద్దతు కూడా వుండకపోవచ్చు. అయినా, రేవంత్‌ రెడ్డి మాట మీద నిలబడ్తారని ఎలా అనుకోగలం.?

మరింత సమాచారం తెలుసుకోండి: