ఈ మద్య మన నాయకులకు అల్పసంఖ్యాక వర్గాల ప్రజలపై ప్రేమ పొర్లిపోతుంది. మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని అనగానే ఊడిపోయే వివాహబంధాన్ని ముస్లిం మహిళలు ఎంతగానో భరిస్తూ వస్తున్నారు. వారిని ఆ సమస్యల నుండి రక్షించాలన్న తపనతో లోక్-సభలో పాసైన బిల్లును రాజ్యసభకు పంపితే ఆ బిల్లును ఎలా ఫెయిల్ చెయించాలా? అని ఆలోచించే నాయకుల సంఖ్య పెరిగిపోతుందీ మధ్య. వీరి ప్రణాళిక ఎన్నికలలో ముస్లిం ఓట్ బాంక్ కోసమే కాకుండా బిజెపియేతర ప్రత్యామ్నాయం గెలుపుకోసమే తప్ప మరెందుకూ కాదు. ఆ బిల్ పాసైతే ముస్లిం మహిళలు అనేక సమస్యల నుండి బయట పడి ప్రయోజనం పొందుతారన్న ఆలోచన ఏ కోశానలేదు. 
triple talaq bill in rajya sabha Vs Chandrababu కోసం చిత్ర ఫలితం  
“ముమ్మారు తలాక్‌ చెప్పడం నేరం” గా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును కేంద్రప్రభుత్వం  రాజ్యసభకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌  గాంధీ, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్‌ చేశారు. రాజ్యసభలో తలాక్‌ బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇరువురు నేతలకూ ఫోన్ చేసిన బాబు ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. బిల్లును అడ్డుకునేందుకు భాజపా యేతర పక్షాల సభ్యులందరినీ ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. 


భాజపా ముస్లిం వ్యతిరేక చర్యలను గట్టిగా ప్రతిఘటించాలని ఇరువురు నేతలనూ కోరారు. అంతకు ముందు ఈ అంశంపై టిడిపి ఎంపీలతో మాట్లాడిన సీఎం, తమ సభ్యులంతా హాజరయ్యేలా విప్ జారీ చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రాజ్యసభ లో ఈ బిల్లును పాస్ కానివ్వబోమని తెదేపా ఎంపీలు డిల్లీలో స్పష్టం చేశారు. తలాక్ బిల్లు రాజ్యసభకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. 
triple talaq bill in rajya sabha Vs Chandrababu కోసం చిత్ర ఫలితం
మరోవైపు భాజపా నేతలు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. మరోవైపు విపక్ష పార్టీల నేతలు సైతం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఛాంబర్‌లో సమావేశమయ్యారు.


ఇదిలా ఉంటే చంద్రబాబు అమరావతి   ప్రాంతంలోని దేవాలయం కూల్చమని ఆదేశాలు జారీ చేశారట! 

రాజధాని ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు నివాసాలు కూల్చేందుకు యత్నించిన అధికారుల దృష్టి నేడు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో ఉన్న దేవాలయంపై పడింది. తుపానుకు రేకులషెడ్డు మరియు నిర్మాణంలో ఉన్న దేవాలయం నేలమట్టం కావడంతో స్థానికులు చందాలు పోగు చేసి నూతన భవన నిర్మాణం చేపట్టారు.


నిర్మాణం పూర్తయిన తర్వాత ఇరిగేషన్‌ అధికారులు దాన్ని కూల్చేందుకు శనివారం ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. గడచిన ఆదివారం తిరిగి మరలా ఆ దేవాలయాన్ని కూల్చేందుకు ఇరిగేషన్‌ అధికారులు సంఘటనా స్థలం వద్దకు రాగా, స్థానికంగా ఉన్న మహిళలు, భక్తులు అడ్డుపడ్డారు. రెండు గంటల పాటు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో హైడ్రామా నడిచింది.
CM Orders to Remove Temple in Amaravati - Sakshi
"నిర్మాణం చేసేటప్పుడు కళ్లకు కనబడలేదా? నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చడమేమిటి" అంటూ స్థానికులు ప్రశ్నించడంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు సీఎం గారు తొలగించ మన్నారని తెలియజేశారు. సీఎం ఉండే నివాసం కూడా అక్రమ కట్టడమే కదా! దాన్ని మీరు ఎందుకు తొలగించడం లేదు? దాన్ని తొలగించడానికి మీకు అధికారం లేదా అంటూ ఓ మహిళ ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించింది.


ఇళ్లను కూలదోసినా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోయినా ఎవరూ మాట్లాడలేదు,  కనీసం దేవాలయం కూడా ఉంచరా? అని నిలదీశారు. మీరు కట్టిన ఎత్తిపోతల పథకం కనిపించడం లేదని దీన్ని కూలుస్తున్నారా?
CM chandrababu asked to remove temple కోసం చిత్ర ఫలితం
మీరు బిల్డింగ్‌ పడవేస్తే విగ్రహాలతో పాటు పుట్ట దెబ్బతింటుందని, దాన్ని పడేయడానికి వీల్లేదంటూ పుట్టచుట్టూ భక్తులు నిలబడ్డారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ,  చౌదరి సంఘటనా స్థలానికి వచ్చి భక్తులతో చర్చలు జరిపారు. చివరకు పుట్టకు, విగ్రహాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిర్మాణాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయినాసరే వారు ఎలా తొలగిస్తారో? మేము ఇక్కడే ఉండి చూస్తామని మొండి కేసి బైఠాయించడంతో పుట్ట చుట్టూ గడ్డర్లు ఏర్పాటు చేసి దానిపై పెద్ద పెద్ద రేకులు ఏర్పాటు చేసి, పొక్లెయిన్‌ తో కూల్చేందుకు ప్రయత్నం చేశారు. అలా కూలిస్తే పుట్ట, విగ్రహాలు దెబ్బతింటాయని మరోసారి భక్తులు అటకాయించడంతో, చివరకు పొక్లెయిన్‌ తో పనులు ఆపేసి, కూలీల చేత దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం ప్రారంభించారు. ఏదేమైనా ఎత్తిపోతల పథకం బకింగ్‌-హామ్‌ కెనాల్‌ హెడ్‌-స్లూయిస్‌ నుంచి సరిగ్గా కనిపించడంలేదని ఆ బిల్డింగ్‌ తొలగించాలన్న కోరిక ఇరిగేషన్‌ అధికారులు తీర్చుకున్నారు.


ఇక్కడ బాబు గారి నివాసం అక్రమ కట్టడమైనా కూల్చరట. కాని హిందువులు పూజలూ ప్రార్ధనలు జరుపుకునే గుడిని కూల్చేస్తారట. హిందువుల ఓట్లంటే భయంలేదు ఈ సారుకి.

మరింత సమాచారం తెలుసుకోండి: